ప|| ఎంత బోధించి యేమిసేసిన దన- | దొంతికర్మములు తొలగీనీ ||
చ|| సతతదురాచారజడునకు బుణ్యసం- | గతి దలపోసిన గలిగీనా |
అతిపాపకర్మబోధకుడై వెలయుదుష్టు | మతి దలపోసిన మరి కలిగీనా ||
చ|| బహుజీవహింసాపరుడైనవానికి | యిహపరములు దైవ మిచ్చీనీ ||
విహితకర్మములువిడిచినవానికి | సహజాచారము జరిగీనా ||
చ|| దేవదూషకుడై తిరిగేటివానికి | దేవతాంతరము దెలిసీనా |
శ్రీవేంకటేశ్వరు జింతింపకుండిన | పావనమతియై బ్రతికీనా ||
pa|| eMta bOdhiMci yEmisEsina dana- | doMtikarmamulu tolagInI ||
ca|| satatadurAcArajaDunaku buNyasaM- | gati dalapOsina galigInA |
atipApakarmabOdhakuDai velayuduShTu | mati dalapOsina mari kaligInA ||
ca|| bahujIvahiMsAparuDainavAniki | yihaparamulu daiva miccInI ||
vihitakarmamuluviDicinavAniki | sahajAcAramu jarigInA ||
ca|| dEvadUShakuDai tirigETivAniki | dEvatAMtaramu delisInA |
SrIvEMkaTESvaru jiMtiMpakuMDina | pAvanamatiyai bratikInA ||