ప|| ఎంత భక్తవత్సలుడ విట్టుండవలదా | వింతలు నీసుద్దులెల్లా వినబోతే నిట్టివే ||
చ|| యిల నసురారియనేయీబిరుదు చెల్లె నీకు | బలివిభీషణాదులపాలికే చెల్లదు |
కెలసి అవులే నీవు గెలుతు వెందరినైనా | తలచి చూడ నీదాసుల కోడుదువు ||
చ|| ఇందరపాలిటికిని యీశ్వరుడ వేలికవు | పందవై యర్జునుబండిబంట వైతివి |
వందనకు నౌలే దేవతలకే దొరవు | అందపునీదాసులకు నన్నిటా దాసుడవు ||
చ|| కడుపులో లోకముకన్నతండ్రి విన్నిటాను | కొడుకవు దేవకికి గోరినంతనే |
తడవితే వేదములు తగిలేబ్రహ్మమవు | విడువనిమాకైతే శ్రీవేంకటాద్రిపతివి ||
pa|| eMta BaktavatsaluDa viTTuMDavaladA | viMtalu nIsuddulellA vinabOtE niTTivE ||
ca|| yila nasurAriyanEyIbirudu celle nIku | baliviBIShaNAdulapAlikE celladu |
kelasi avulE nIvu gelutu veMdarinainA | talaci cUDa nIdAsula kODuduvu ||
ca|| iMdarapAliTikini yISvaruDa vElikavu | paMdavai yarjunubaMDibaMTa vaitivi |
vaMdanaku naulE dEvatalakE doravu | aMdapunIdAsulaku nanniTA dAsuDavu ||
ca|| kaDupulO lOkamukannataMDri vinniTAnu | koDukavu dEvakiki gOrinaMtanE |
taDavitE vEdamulu tagilEbrahmamavu | viDuvanimAkaitE SrIvEMkaTAdripativi ||