ప|| ఎంతనేర్చెనే ఈ కలికి | ఇంతుల కేటకే ఇంతేసి పగటు ||
చ|| చలముల నెరపుచు సవతుల దూరుచు | సలిగెల పొరలీ జవరాలు |
చెలువుని సొలయుచు చేతులు చాపుచు | కెలపుల నగవుల కెరలీని ||
చ|| సాటికి పెనగుచు సణగుచు రాల్చుచు | నీటున మురిసీ నెరజాణ |
మాటల గునియుచు మదమున మొరయుచు | జూటుదనంబుల జూచీని ||
చ|| మంతన మాడుచు మలయుచు నవ్వుచు | పంతము లాడీ పసలాడీ |
ఇంతలో శ్రీవేంకటేశుడు నన్నేలె | పొంతనుండి నను పొగడీని ||
pa|| eMtanErcenE I kaliki | iMtula kETakE iMtEsi pagaTu ||
ca|| calamula nerapucu savatula dUrucu | saligela poralI javarAlu |
celuvuni solayucu cEtulu cApucu | kelapula nagavula keralIni ||
ca|| sATiki penagucu saNagucu rAlcucu | nITuna murisI nerajANa |
mATala guniyucu madamuna morayucu | jUTudanaMbula jUcIni ||
ca|| maMtana mADucu malayucu navvucu | paMtamu lADI pasalADI |
iMtalO SrIvEMkaTESuDu nannEle | poMtanuMDi nanu pogaDIni ||