ప|| ఎంతపాపకర్మమాయ యెంతవింతచింతలాయ | వింతవారితోడిపొందు వేసటాయ దైవమా ||
చ|| చూడజూడ గొత్తలాయ చుట్టమొకడు లేడాయ | వీడుబట్టు అలుచాయ వేడుక లుడివోయను |
జోడుజోడు గూడదాయ చొక్కుదనము మానదాయ | యేడకేడ తలపోత యెంతసేసె దైవమా ||
చ|| నీరులేనియేరు దాటనేర దెంతేలోతాయ | మేరవెళ్ళ నీదడాయ మేటి జేరడాయను |
తోరమైన ఆసలుబ్బి తోవ గానిపించదాయ | కోరి రాకపోకచేత కొల్లబోయ గాలము ||
చ|| తల్లిదండ్రి దాత గురువు తానెయైననాచారి- | వల్లభుండు నాకు మేలువంటిదాయ జన్మము |
కల్లగాదు వేంకటేశుఘనుని పాదసేవ నాకు | మొల్లమాయ నామనసు మోదమాయ దైవమా ||
pa|| eMtapApakarmamAya yeMtaviMtaciMtalAya | viMtavAritODipoMdu vEsaTAya daivamA ||
ca|| cUDajUDa gottalAya cuTTamokaDu lEDAya | vIDubaTTu alucAya vEDuka luDivOyanu |
jODujODu gUDadAya cokkudanamu mAnadAya | yEDakEDa talapOta yeMtasEse daivamA ||
ca|| nIrulEniyEru dATanEra deMtElOtAya | mEraveLLa nIdaDAya mETi jEraDAyanu |
tOramaina Asalubbi tOva gAnipiMcadAya | kOri rAkapOkacEta kollabOya gAlamu ||
ca|| tallidaMDri dAta guruvu tAneyainanAcAri- | vallaBuMDu nAku mEluvaMTidAya janmamu |
kallagAdu vEMkaTESuGanuni pAdasEva nAku | mollamAya nAmanasu mOdamAya daivamA ||