Learn English Vocabulary & Help the Poor| Vocaulary |<><><><><>Free download annamayya annamacarya top popular audio video songs lyrics music sung by bala subrahmanyam murali krishna prasad mangalampalli priya sisters nitya santoshini sobha raju SP sailaja etc

eTTu sEsinA jEyi - ఎట్టు సేసినా జేయి

ఎట్టు సేసినా (రాగం: ) (తాళం : )

ప|| ఎట్టు సేసినా జేయి యెదురాడను | నెట్టుకొని చూచేవి నీ మహిమలికను ||

చ|| మొగము నీవు చూచితే మొక్కుచును సంతోసింతు | నగితేనే నీ మేలు నమ్ముదు నేను |
బిగి వీడెమిచ్చితేనే చెప్పుకొందు జెలులతో | పగటు నీ చిత్తము నా భాగ్యమికను ||

చ|| మాటలు నీ వాడితేనే మనసు గరుగుదును | గాటాన చేయి వేసితే గడు మెత్తును |
పాటించి గోరనంటితే పలుమారు జెలగుదు | కోటికి నీ కరుణే కోరితి నేనికను ||

చ|| పచ్చడము గప్పితేను పలుమారు నిన్ను మెత్తు | మచ్చిక నీవు చూపితే మరుగుదును |
ఇచ్చకుడ శ్రీ వేంకటేశ నన్ను గూడితివి | సచ్చియైన నీ మన్ననే బతుకు నా కికను ||

eTTu sEsinA (Raagam: ) (Taalam: )

pa|| eTTu sEsinA jEyi yedurADanu | neTTukoni cUcEvi nI mahimalikanu ||

ca|| mogamu nIvu cUcitE mokkucunu saMtOsiMtu | nagitEnE nI mElu nammudu nEnu |
bigi vIDemiccitEnE ceppukoMdu jelulatO | pagaTu nI cittamu nA BAgyamikanu ||

ca|| mATalu nI vADitEnE manasu garugudunu | gATAna cEyi vEsitE gaDu mettunu |
pATiMci gOranaMTitE palumAru jelagudu | kOTiki nI karuNE kOriti nEnikanu ||

ca|| paccaDamu gappitEnu palumAru ninnu mettu | maccika nIvu cUpitE marugudunu |
iccakuDa SrI vEMkaTESa nannu gUDitivi | sacciyaina nI mannanE batuku nA kikanu ||