ప|| ఎట్టుచేసిన జేసె నేమిసేయగవచ్చు | చుట్టపువిరోధంబు సూనాస్త్రుచెలిమి ||
చ|| ఒడలిలోపలిరోగ మొనర బరితాపంబు | కడుపులోపలిపుండు కడలేనియాస |
తడిపాతమెడగోత తలపువిషయాసక్తి | గుడిమీదితరువు అలుగులము ప్రాణులకు ||
చ|| నీడలోపలయెండ నెలకొన్నబంధంబు | గోడపైసున్నంబు కొదలేనియెఱుక |
పాడూరిలో బ్రదుకు పాపకర్మబుద్ధి | తాడుపైతపసు తమధనము ప్రాణులకు ||
చ|| మంటజేసినబొమ్మమనికి సంసారంబు | రెంటికినిగానివీరిడికొలువు బ్రదుకు |
యింటివేలుపు వేంకటేశు గొలువక పరుల- | వెంట దిరుగుట వోడవిడిచి వదరిడుట ||
pa|| eTTucEsina jEse nEmisEyagavaccu | cuTTapuvirOdhaMbu sUnAstrucelimi ||
ca|| oDalilOpalirOga monara baritApaMbu | kaDupulOpalipuMDu kaDalEniyAsa |
taDipAtameDagOta talapuviShayAsakti | guDimIditaruvu alugulamu prANulaku ||
ca|| nIDalOpalayeMDa nelakonnabaMdhaMbu | gODapaisunnaMbu kodalEniyerxuka |
pADUrilO braduku pApakarmabuddhi | tADupaitapasu tamadhanamu prANulaku ||
ca|| maMTajEsinabommamaniki saMsAraMbu | reMTikinigAnivIriDikoluvu braduku |
yiMTivElupu vEMkaTESu goluvaka parula- | veMTa diruguTa vODaviDici vadariDuTa ||