ప|| ఏమని నుతించవచ్చు యీతని ప్రతాపము | కామించి యీరేడు లోకములెల్లా నిండెను ||
చ|| యీవల దేవుడు రథమెక్కితేను దైత్యులెల్ల | కావిరి జక్రవాళాద్రి కడ కెక్కిరి |
భావించి చక్రమీతడు పట్టితే నసురలెల్ల | ధావతి తోడుతను పాతాళము వట్టిరి ||
చ|| గరుడధ్వజము హరి కట్టెదుర నెత్తించితే | పరువెత్తిరి దానవ బలమెల్లను |
గరిమ నితేరి బండికండ్లు గదలితేను | ఖరమైన దైత్యసేన క్రక్కదలి విరిగె ||
చ|| ధృతి శ్రీ వేంకటేశుడు తిరువీధులేగితేను | కుతిలాన శత్రులు దిక్కుల కేగిరి |
తతి నలమేల్మంగతో తన నగరు చొచ్చితే | సతమై బలిముఖ్యులు శరణము జొచ్చిరి ||
pa|| Emani nutiMcavaccu yItani pratApamu | kAmiMci yIrEDu lOkamulellA niMDenu ||
ca|| yIvala dEvuDu rathamekkitEnu daityulella | kAviri jakravALAdri kaDa kekkiri |
BAviMci cakramItaDu paTTitE nasuralella | dhAvati tODutanu pAtALamu vaTTiri ||
ca|| garuDadhvajamu hari kaTTedura nettiMcitE | paruvettiri dAnava balamellanu |
garima nitEri baMDikaMDlu gadalitEnu | Karamaina daityasEna krakkadali virige ||
ca|| dhRuti SrI vEMkaTESuDu tiruvIdhulEgitEnu | kutilAna Satrulu dikkula kEgiri |
tati nalamElmaMgatO tana nagaru coccitE | satamai balimuKyulu SaraNamu jocciri ||