ప|| ఏమని పొగడేమిదె నీరమణిని | కోమలపు వయసు కోకిలవాణి ||
చ|| దొంతలు వెట్టీ తోడనె వలపులు | కొంతపు చూపుల కోమలి |
సంతనసేసి సరసపు మాటల | వింత వేడుకల వెన్నెల పతిమ ||
చ|| విందులు చేసి వేమరు ప్రియములు | కందువ నవ్వులు కలకంఠి |
బిందెల నించి పెకగు సిగ్గులు | మందె మేళముల మదనుని శరము ||
చ|| పైరులు విత్తీబలు తమకంబుల | మేరతో రతినలమేల్మంగ |
ఈరీతి శ్రీవేంకటేశ నిన్నెనసె | సారెపు గుణముల జమళిమెరుంగుల ||
pa|| Emani pogaDEmide nIramaNini | kOmalapu vayasu kOkilavANi ||
ca|| doMtalu veTTI tODane valapulu | koMtapu cUpula kOmali |
saMtanasEsi sarasapu mATala | viMta vEDukala vennela patima ||
ca|| viMdulu cEsi vEmaru priyamulu | kaMduva navvulu kalakaMThi |
biMdela niMci pekagu siggulu | maMde mELamula madanuni Saramu ||
ca|| pairulu vittIbalu tamakaMbula | mEratO ratinalamElmaMga |
IrIti SrIvEMkaTESa ninnenase | sArepu guNamula jamaLimeruMgula ||