ప|| ఏమి వలసిన నిచ్చు నెప్పుడైనను | ఏమరుక కొలచిన నితడే దైవము ||
చ|| ఘనముగా నిందరికి గన్నులిచ్చు గాళ్ళిచ్చు | పనిసేయ జేతులిచ్చు బలియుడై |
తనుగొలువమని చిత్తము లిచ్చు గరుణించి | వొనర లోకానకెల్ల నొక్కడే దైవము ||
చ|| మచ్చిక తనుగొలువ మనసిచ్చు మాటలిచ్చు | కుచ్చితములేని కొడుకుల నిచ్చును |
చొచ్చినచోటే చొచ్చి శుభమిచ్చు సుఖమిచ్చు | నిచ్చలు లోకానకెల్ల నిజమైన దైవము ||
చ|| పంతమాడి కొలచిన బ్రాణమిచ్చు ప్రాయమిచ్చు | యెంతటి పదవులైన నిట్టె యిచ్చు |
వింతవింత విభవాల వేంకటేశుడిదే మా- | యంతరంగమున నుండే అరచేతిదైవము||
pa|| Emi valasina niccu neppuDainanu | Emaruka kolacina nitaDE daivamu ||
ca|| GanamugA niMdariki gannuliccu gALLiccu | panisEya jEtuliccu baliyuDai |
tanugoluvamani cittamu liccu garuNiMci | vonara lOkAnakella nokkaDE daivamu ||
ca|| maccika tanugoluva manasiccu mATaliccu | kuccitamulEni koDukula niccunu |
coccinacOTE cocci SuBamiccu suKamiccu | niccalu lOkAnakella nijamaina daivamu ||
ca|| paMtamADi kolacina brANamiccu prAyamiccu | yeMtaTi padavulaina niTTe yiccu |
viMtaviMta viBavAla vEMkaTESuDidE mA- | yaMtaraMgamuna nuMDE aracEtidaivamu||