ప|| ఏమిటికి చలము యెందాక | నాముల తోడుత నగవే యికను ||
చ|| బలుము లేమిటికి బచరించేవే | వలచిన దానవు వనితవు |
సొలయుచు రమణుని సోదింతురటే | అలరి ఇచ్చకములాడుట గాక ||
చ|| తగవులబెట్టగ తగునటవే యిక | మగనితోడ పలుమరు నిపుడు |
అగడుసేతురా అతని నింతేసి | చిగురు మోవొసగి చెలగుట గాక ||
చ|| కూడిన వేళను గుట్టు సేతురా | యీడనె శ్రీ వేంకటేశునెడ |
ఆడకు వెంగెము లలమేల్మంగవు | వీడెములందుక వెలయుట గాక ||
pa|| EmiTiki calamu yeMdAka | nAmula tODuta nagavE yikanu ||
ca|| balumu lEmiTiki bacariMcEvE | valacina dAnavu vanitavu |
solayucu ramaNuni sOdiMturaTE | alari iccakamulADuTa gAka ||
ca|| tagavulabeTTaga tagunaTavE yika | maganitODa palumaru nipuDu |
agaDusEturA atani niMtEsi | ciguru mOvosagi celaguTa gAka ||
ca|| kUDina vELanu guTTu sEturA | yIDane SrI vEMkaTESuneDa |
ADaku veMgemu lalamElmaMgavu | vIDemulaMduka velayuTa gAka ||