ప|| ఏమిగల దిందు నెంతపెనగిన వృథా | కాముకపుమనసునకు కడమొదలు లేదు ||
చ|| పత్తిలోపలి నూనెవంటిది జీవనము | విత్తుమీదటి పొల్లువిధము దేహంబు |
బత్తిసేయుట యేమి పాసిపోవుట యేమి | పొత్తులసుఖంబులకు పొరలుటలుగాక ||
చ|| ఆకాశపాకాశ మరుదైనకూటంబు | లోకరంజకంబు తమలోని సమ్మతము |
చాకిమణుగులజాడ చంచలపుసంపదలు | చేకొనిననేమి యివి చెదిరినను నేమి ||
చ|| గాదెపోసినకొలుచు కర్మిసంసారంబు | వేదువిడువనికూడు పెడమాయబదుకు |
వేదనల నెడతెగుట వేంకటేశ్వరుకృపా- | మోదంబు వడసినను మోక్షంబు గనుట ||
pa|| Emigala diMdu neMtapenagina vRuthA | kAmukapumanasunaku kaDamodalu lEdu ||
ca|| pattilOpali nUnevaMTidi jIvanamu | vittumIdaTi polluvidhamu dEhaMbu |
battisEyuTa yEmi pAsipOvuTa yEmi | pottulasuKaMbulaku poraluTalugAka ||
ca|| AkASapAkASa marudainakUTaMbu | lOkaraMjakaMbu tamalOni sammatamu |
cAkimaNugulajADa caMcalapusaMpadalu | cEkoninanEmi yivi cedirinanu nEmi ||
ca|| gAdepOsinakolucu karmisaMsAraMbu | vEduviDuvanikUDu peDamAyabaduku |
vEdanala neDateguTa vEMkaTESvarukRupA- | mOdaMbu vaDasinanu mOkShaMbu ganuTa ||