Emi galigenu - ఏమి గలిగెను

ఏమి గలిగెను (రాగం: ) (తాళం : )

ప|| ఏమి గలిగెను మాకిందువలన | వేమారు బొరలితిమి వెర్రిగొన్నట్లు ||

చ|| తటతటన నీటిమీదట నాలజాలంబు- | లిటునటు జరించవా యీది యీది |
అటువలెనెపో తమకమంది సంసారంపు- | ఘటనకై తిరిగితిమి కడగానలేక ||

చ|| దట్టముగ బారావతములు మిన్నుల మోవ | కొట్టగొన కెక్కెనా కూడికూడి |
వట్టియాసలనే యిటువలెనేపో యిన్నాళ్ళు | బట్టబయ లీదితిమి పనిలేనిపాట ||

చ|| బెరసి కుమ్మరపురువు పేడలోపలనెల్ల | పొరలదా పలుమారు బోయొపోయి |
వరుస జన్మముల నటువలెనెపో పొరలితిమి | తిరువేంకటాచలాధిపు దలచలేక ||

Emi galigenu (Raagam: ) (Taalam: )

pa|| Emi galigenu mAkiMduvalana | vEmAru boralitimi verrigonnaTlu ||

ca|| taTataTana nITimIdaTa nAlajAlaMbu- | liTunaTu jariMcavA yIdi yIdi |
aTuvalenepO tamakamaMdi saMsAraMpu- | GaTanakai tirigitimi kaDagAnalEka ||

ca|| daTTamuga bArAvatamulu minnula mOva | koTTagona kekkenA kUDikUDi |
vaTTiyAsalanE yiTuvalenEpO yinnALLu | baTTabaya lIditimi panilEnipATa ||

ca|| berasi kummarapuruvu pEDalOpalanella | poraladA palumAru bOyopOyi |
varusa janmamula naTuvalenepO poralitimi | tiruvEMkaTAcalAdhipu dalacalEka ||