ప|| ఎన్ని మహిమల వాడే ఈ దేవుడు | కనుల పండువులెల్ల గదిసినట్లుండె ||
చ|| పోలింపు కర్పూర కాపు పురుషోత్తమునికి | ఏలీల నుండె నని యెంచి చూచితే |
పాల జలధిలోన పవళింపగా మేన | మేలిమి మీగ డంటిన మెలుపుతో నుండె ||
చ|| తట్టు పునుగు కాపు దైవ శిఖామణికి | ఎట్టుండెనని మది నెంచి చూచితే |
చిట్టకాన రేపల్లెలో చీకటి తప్పు సేయగా | అట్టె రాత్రులు మేన నంటి నట్లుండె ||
చ|| అలమేలు మంగతో అట్టె సొమ్ము ధరించి | ఎలమి శ్రీ వేంకటేశు నెంచి చూచితే |
కలిమిగల ఈ కాంత కౌగిట పెనగగాను | నిలువెల్ల సిరులై నిండినట్లుండె ||
pa|| enni mahimala vADE I dEvuDu | kanula paMDuvulella gadisinaTluMDe ||
ca|| pOliMpu karpUra kApu puruShOttamuniki | ElIla nuMDe nani yeMci cUcitE |
pAla jaladhilOna pavaLiMpagA mEna | mElimi mIga DaMTina meluputO nuMDe ||
ca|| taTTu punugu kApu daiva SiKAmaNiki | eTTuMDenani madi neMci cUcitE |
ciTTakAna rEpallelO cIkaTi tappu sEyagA | aTTe rAtrulu mEna naMTi naTluMDe ||
ca|| alamElu maMgatO aTTe sommu dhariMci | elami SrI vEMkaTESu neMci cUcitE |
kalimigala I kAMta kaugiTa penagagAnu | niluvella sirulai niMDinaTluMDe ||