ప|| ఎన్నిలేవు నాకిటువంటివి | కన్నులెదుట నిన్ను గనుగొనలేనైతి ||
చ|| అరయ నేజేసినయపరాధములు చూచి | కరుణించి వొకడైన గాచునా |
కరచరణాదులు కలిగించిననిన్ను | బరికించి నీసేవాపరుడ గాలేనైతి ||
చ|| ఏతరినై నే నెరిగి సేసినయట్టి- | పాతక మొకడైనా బాపునా |
ఆతుమలోనుండి యలరి నోవొసగిన- | చేతనమున నిన్ను జెలగి చేరనైతి ||
చ|| శ్రీవేంకటేశ నే జెసినయితరుల- | సేవ కొకడు దయసేయునా |
నీవే యిచ్చినయట్టి నే నీశరీరముతోడ | నీవాడ ననుబుద్ధి నిలుపనేరనైతి ||
pa|| ennilEvu nAkiTuvaMTivi | kannuleduTa ninnu ganugonalEnaiti ||
ca|| araya nEjEsinayaparAdhamulu cUci | karuNiMci vokaDaina gAcunA |
karacaraNAdulu kaligiMcinaninnu | barikiMci nIsEvAparuDa gAlEnaiti ||
ca|| Etarinai nE nerigi sEsinayaTTi- | pAtaka mokaDainA bApunA |
AtumalOnuMDi yalari nOvosagina- | cEtanamuna ninnu jelagi cEranaiti ||
ca|| SrIvEMkaTESa nE jesinayitarula- | sEva kokaDu dayasEyunA |
nIvE yiccinayaTTi nE nISarIramutODa | nIvADa nanubuddhi nilupanEranaiti ||