ప|| ఎప్పుడును గుట్టుతోడి యిల్లాండ్లము నేము | వొప్పుగ సిగ్గు విడువనోజగాదు మాకును ||
చ|| మాట మాటలను నీకు మనసిచ్చి మెచ్చి యాపె | కాటుక కన్నుల జూచి కరగించీని |
తేటలు నేరుచునాపె తేలించనోపు నాపె | యేటికి యవ్వరిపొందులేమి బాతి యికను ||
చ|| చేయివేసి చేయివేసి చెక్కునొక్కి చేత మొక్కి | మాయపు నవ్వులు నవ్వి మరగించీని |
చాయలకు వచ్చునాపె సరసములాడు నాపె | ఆయనాయ వున్నసుద్దులాడ నేల యికను ||
చ|| వలపులు చల్లి చల్లి వాడికెగా నిన్ను గూడి | వెలయించ నేర్చునాపె యిన్నిటా నాపె |
అలరి శ్రీ వేంకటేశ అప్పటి నన్ను గూడితి | తొలుతటి సద్దులేల దొమ్ములేల యికను ||
pa|| eppuDunu guTTutODi yillAMDlamu nEmu | voppuga siggu viDuvanOjagAdu mAkunu ||
ca|| mATa mATalanu nIku manasicci mecci yApe | kATuka kannula jUci karagiMcIni |
tETalu nErucunApe tEliMcanOpu nApe | yETiki yavvaripoMdulEmi bAti yikanu ||
ca|| cEyivEsi cEyivEsi cekkunokki cEta mokki | mAyapu navvulu navvi maragiMcIni |
cAyalaku vaccunApe sarasamulADu nApe | AyanAya vunnasuddulADa nEla yikanu ||
ca|| valapulu calli calli vADikegA ninnu gUDi | velayiMca nErcunApe yinniTA nApe |
alari SrI vEMkaTESa appaTi nannu gUDiti | tolutaTi saddulEla dommulEla yikanu ||