ప|| ఎపుడు గానిరాడో యెంత దడవాయ కాని | చప్పుడాలకించి మతి జల్లురనెనమ్మా ||
చ|| ఇద్దర మదరిపాటు ఏకాంతాన నాడుకొన్న | సుద్దులు దలచి మేను చురుకనెనమ్మా |
పెద్దగా గస్తూరి బొట్టూ పెట్టిన నాతడు గోర | తిద్దుట దలచి మేను దిగులనేనమ్మా||
చ|| పాయక యతడూ నేను బవ్వళించే యింటి వంక | బోయపోయి కడు జిన్నబోతినే యమ్మ |
తోయపు గుబ్బల చన్నుదోయి మీద వాడొత్తిన | పాయపుజంద్రులజూచి భ్రమసితినమ్మా ||
చ|| కూడిన సౌఖ్యములందు కొదలేని వానినా | వేడుక మతి దలచి వెరగాయనమ్మా |
యీడులేని తిరు వేంకటేశుడిదె నాతోడ | నాడినట్టే నాచిత్త మలరించెనమ్మా ||
pa|| epuDu gAnirADO yeMta daDavAya kAni | cappuDAlakiMci mati jalluranenammA ||
ca|| iddara madaripATu EkAMtAna nADukonna | suddulu dalaci mEnu curukanenammA |
peddagA gastUri boTTU peTTina nAtaDu gOra | tidduTa dalaci mEnu digulanEnammA||
ca|| pAyaka yataDU nEnu bavvaLiMcE yiMTi vaMka | bOyapOyi kaDu jinnabOtinE yamma |
tOyapu gubbala cannudOyi mIda vADottina | pAyapujaMdrulajUci BramasitinammA ||
ca|| kUDina sauKyamulaMdu kodalEni vAninA | vEDuka mati dalaci veragAyanammA |
yIDulEni tiru vEMkaTESuDide nAtODa | nADinaTTE nAcitta malariMcenammA ||