ప|| ఎఱుగనైతి నిందాకా నేటిదో యంటానుంటి | నెఱి దొరలనాడీని నేనే మందు నికను ||
చ|| కొండలలో నెలకొన్న కోన చెన్నరాయడిదే | బొండు మల్లెల వేసెనేపూచి నన్నును |
పండుముత్తేల సొమ్ములప్పటి నామెడ బెట్టి | దుండగము సేసె నేమందు నేనికను ||
చ|| గొప్పయైన యేటిదరి గోన చెన్నరాయడిదే | దప్పికి గప్పురదుంపె దరుణి చేత |
చెప్పరాని మాటలెల్ల జెవిలో దానే చెప్పి | దుప్పటి గప్పీ నేమందు నికను ||
చ|| గుఱితో శ్రీ వేంకటాద్రి కోన చెన్నరాయడిదే | చెరుగు పట్టి ప్రియురాలు చెప్పికూడెను |
జఱయుచు వచ్చి వచ్చి చనవు లెల్లా నొసగి | మెఱసి తొరల నాడి మఱే మందు నికను ||
pa|| eRuganaiti niMdAkA nETidO yaMTAnuMTi | neRi doralanADIni nEnE maMdu nikanu ||
ca|| koMDalalO nelakonna kOna cennarAyaDidE | boMDu mallela vEsenEpUci nannunu |
paMDumuttEla sommulappaTi nAmeDa beTTi | duMDagamu sEse nEmaMdu nEnikanu ||
ca|| goppayaina yETidari gOna cennarAyaDidE | dappiki gappuraduMpe daruNi cEta |
cepparAni mATalella jevilO dAnE ceppi | duppaTi gappI nEmaMdu nikanu ||
ca|| guRitO SrI vEMkaTAdri kOna cennarAyaDidE | cerugu paTTi priyurAlu ceppikUDenu |
jaRayucu vacci vacci canavu lellA nosagi | meRasi torala nADi marxE maMdu nikanu ||