ప|| ఎఱుగుదురిందరు నెఱిగీనెఱుగరు | హరి దానే నిజపరమాతుమని ||
చ|| నలినాసనుడెఱుగు నారదుడెఱుగు | కొలది శివుడెఱుగు గుహుడెఱుగు |
యిల గపిలుడెఱుగు నింతా మనువెఱుగు | తలప విష్ణుడే పరతత్త్వమని ||
చ|| బెరసి ప్రహ్లాదుడు భీష్ముడు జనకుడు | గురుతుగ బలియు శుకుడు గాలుడు |
వరుస నెఱుగుదురు వడి రహస్యముగ | హరి యితడే పరమాత్ముడని ||
చ|| తెలియదగిన దిది తెలియరాని దిది | తెలిసినాను మది దెలియ దిది |
యిల నిందరు దెలిసిరిదే పరమమని | కలవెల్ల దెలిపె వేంకటరాయడు ||
pa|| eRuguduriMdaru neRigIneRugaru | hari dAnE nijaparamAtumani ||
ca|| nalinAsanuDeRugu nAraduDeRugu | koladi SivuDeRugu guhuDeRugu |
yila gapiluDeRugu niMtA manuveRugu | talapa viShNuDE paratattvamani ||
ca|| berasi prahlAduDu BIShmuDu janakuDu | gurutuga baliyu SukuDu gAluDu |
varusa neRuguduru vaDi rahasyamuga | hari yitaDE paramAtmuDani ||
ca|| teliyadagina didi teliyarAni didi | telisinAnu madi deliya didi |
yila niMdaru delisiridE paramamani | kalavella delipe vEMkaTarAyaDu ||