ప|| ఎఱుక గలుగునా డెఱుగడటా | మఱచినమేనితొ మరి యెఱిగీనా ||
చ|| పటువైభవముల బరగేటినాడె | తటుకున శ్రీహరి దలచడటా |
కుటిలదేహియై కుత్తిక బ్రాణము | తటతటనదరగ దలచీనా ||
చ|| ఆలుబిడ్డలతో మహాసుఖ మందుచు | తాలిమితో హరి దలచడటా |
వాలినకాలునివసమైనప్పుడు | దాళి వేడగా దలచీనా ||
చ|| కొఱతలేని తేకువ దానుండేటి- | తఱి వేంకటపతి దలచడటా |
మరులు దేహియై మఱచివున్నయడ | తఱచుటూరుపుల దలచీనా ||
pa|| eRuka galugunA DerxugaDaTA | maRacinamEnito mari yeRigInA ||
ca|| paTuvaiBavamula baragETinADe | taTukuna SrIhari dalacaDaTA |
kuTiladEhiyai kuttika brANamu | taTataTanadaraga dalacInA ||
ca|| AlubiDDalatO mahAsuKa maMducu | tAlimitO hari dalacaDaTA |
vAlinakAlunivasamainappuDu | dALi vEDagA dalacInA ||
ca|| koRatalEni tEkuva dAnuMDETi- | taRi vEMkaTapati dalacaDaTA |
marulu dEhiyai maRacivunnayaDa | taRacuTUrupula dalacInA ||