ప|| ఎవ్వరు గర్తలుగారు యిందిరానాథుడే కర్త | నివ్వటిల్లాతనివారై నేమము దప్పకురో ||
చ|| కర్మమే కర్తయితే కడకు మోక్షము లేదు | అర్మిలి జీవుడు గర్తయైతే బుట్టుగేలేదు |
మర్మపుమాయ గర్తయితే మరి విజ్ఞానమేలేదు | నిర్మితము హరిదింతే నిజమిదెరుగరో ||
చ|| ప్రపంచమే కర్తయితే పాపపుణ్యములు లేవు | వుపమ మనసు గర్తైయుంటే నాచారమేలేదు |
కపటపు దెహములే కర్తలయితే చావులేదు | నెపము శ్రీహరిదింతే నేరిచి బ్రదుకరో ||
చ|| పలుశ్రుతులు గర్తలై పరగితే మేరలేదు | అల బట్టబయలు గర్తైతే నాధారము లేదు |
యెలమి నిందరికి గర్త యిదివో శ్రీవేంకటాద్రి- | నిలయపుహరి యింతే నేడే కొలువరో ||
pa|| evvaru gartalugAru yiMdirAnAthuDE karta | nivvaTillAtanivArai nEmamu dappakurO ||
ca|| karmamE kartayitE kaDaku mOkShamu lEdu | armili jIvuDu gartayaitE buTTugElEdu |
marmapumAya gartayitE mari vij~jAnamElEdu | nirmitamu haridiMtE nijamiderugarO ||
ca|| prapaMcamE kartayitE pApapuNyamulu lEvu | vupama manasu gartaiyuMTE nAcAramElEdu |
kapaTapu dehamulE kartalayitE cAvulEdu | nepamu SrIharidiMtE nErici bradukarO ||
ca|| paluSrutulu gartalai paragitE mEralEdu | ala baTTabayalu gartaitE nAdhAramu lEdu |
yelami niMdariki garta yidivO SrIvEMkaTAdri- | nilayapuhari yiMtE nEDE koluvarO ||