ఎవ్వరి గాదన్న (రాగం: ) (తాళం : )
ప|| ఎవ్వరి గాదన్న నిది నిన్ను గాదంట | యెవ్వరి గొలిచిన నిది నీకొలువు ||
చ|| అవయవములలో నది గాదిది గా- | దని మేలివి మేలన నేలా |
భువియు బాతాళము దివియు నందలి జంతు- | నివహ మింతయునూ నీదేహమేకాన ||
చ|| నీవు లేనిచోటు నిజముగ దెలిపిన | ఆవల నది గాదనవచ్చును |
శ్రీవేంకటగిరి శ్రీనాథ సకలము | భావింప నీవే పరిపూర్ణుడవుగాన ||
evvari gAdanna (Raagam: ) (Taalam: )
pa|| evvari gAdanna nidi ninnu gAdaMTa | yevvari golicina nidi nIkoluvu ||
ca|| avayavamulalO nadi gAdidi gA- | dani mElivi mElana nElA |
Buviyu bAtALamu diviyu naMdali jaMtu- | nivaha miMtayunU nIdEhamEkAna ||
ca|| nIvu lEnicOTu nijamuga delipina | Avala nadi gAdanavaccunu |
SrIvEMkaTagiri SrInAtha sakalamu | BAviMpa nIvE paripUrNuDavugAna ||