ప|| ఎవ్వరు లేరూ హితవుచెప్పగ వట్టీ- | నొవ్వుల బడి నేము నొగిలేమయ్యా ||
చ|| అడవి బడినవాడు వెడల జోటులేక | తొడరి కంపలకిందు దూరినట్లు |
నడుమ దురిత కాననములతరి బడి | వెడలలేక నేము విసిగేమయ్యా ||
చ|| తెవులువడినవాడు తినబోయి మధురము | చవిగాక పులుసులు చవిగోరినట్లు |
భవరోగముల బడి పరమామృతము నోర | జవిగాక భవములు చవులాయనయ్యా ||
చ|| తనవారి విడిచి యితరమైనవారి- | వెనక దిరిగి తావెర్రైనట్లు |
అనయము తిరువేంకటాధీశు గొల్వక | మనసులోనివాని మరచేమయ్యా ||
pa|| evvaru lErU hitavuceppaga vaTTI- | novvula baDi nEmu nogilEmayyA ||
ca|| aDavi baDinavADu veDala jOTulEka | toDari kaMpalakiMdu dUrinaTlu |
naDuma durita kAnanamulatari baDi | veDalalEka nEmu visigEmayyA ||
ca|| tevuluvaDinavADu tinabOyi madhuramu | cavigAka pulusulu cavigOrinaTlu |
BavarOgamula baDi paramAmRutamu nOra | javigAka Bavamulu cavulAyanayyA ||
ca|| tanavAri viDici yitaramainavAri- | venaka dirigi tAverrainaTlu |
anayamu tiruvEMkaTAdhISu golvaka | manasulOnivAni maracEmayyA ||