ప|| ఎచ్చోటికేగిన యెప్పుడూ దమలోని- | మచ్చిక పెనుదెవులు మానకపోయె ||
చ|| పాయపు సతుల గుబ్బల పెదపొట్లాల | కాయము వడి నొత్తి కాచగాను |
రాయిడిచే ఘనమాయగాని లోని- | మాయపు పెనుదెవులు మానకపోయె ||
చ|| అతివల మోహపుటధరామృతములు | యితవుగ నోరి కందియ్యగను |
అతిమోహమే ఘనమాయగాని లోని- | మతకరి పెనుదెవులు మానకపోయె ||
చ|| తరుణుల మేనిమెత్తని పరపులమీద | నిరవుగ నిటు సుఖియించగను |
తిరువేంకటాచలాధీశు కృపచేగాని | మరుచేతి పెనుదెవులు మానకపోయ ||
pa|| eccOTikEgina yeppuDU damalOni- | maccika penudevulu mAnakapOye ||
ca|| pAyapu satula gubbala pedapoTlAla | kAyamu vaDi notti kAcagAnu |
rAyiDicE GanamAyagAni lOni- | mAyapu penudevulu mAnakapOye ||
ca|| ativala mOhapuTadharAmRutamulu | yitavuga nOri kaMdiyyaganu |
atimOhamE GanamAyagAni lOni- | matakari penudevulu mAnakapOye ||
ca|| taruNula mEnimettani parapulamIda | niravuga niTu suKiyiMcaganu |
tiruvEMkaTAcalAdhISu kRupacEgAni | marucEti penudevulu mAnakapOya ||