ప|| కంచూగాదు పెంచూగాదు కడుబెలుచు మనసు | యెంచరాదు పంచరాదు యెట్టిదో యీమనసు ||
చ|| పట్ట బసలేదు చూడ బయలుగా దీమనసు | నెట్టన బారుచునుండు నీరుగా దీమనసు |
చుట్టి చుట్టి పాయకుండు జుటమూగా దీమనసు | యెట్టనెదుటనే వుండు నేటిదో యీమనసు ||
చ|| రుచులెల్లా గానుపించు రూపు లేదు మనసు | పచరించు నాసలెల్లా బసిడిగా దీమనసు |
యెచటా గరగదు రాయీగాదు మనసు | యిచటా నచటా దానే యేటిదో యీమనసు ||
చ|| తప్పక నాలో నుండు దైవము గాదు మనసు | కప్పి మూటగట్టరాదు గాలీ గాదు మనసు |
చెప్పరానిమహిమలశ్రీవేంకటేశు దలచి | యిప్పుడిన్నిటా గెలిచె నేటిదో యీమనసు ||
pa|| kaMcUgAdu peMcUgAdu kaDubelucu manasu | yeMcarAdu paMcarAdu yeTTidO yImanasu ||
ca|| paTTa basalEdu cUDa bayalugA dImanasu | neTTana bArucunuMDu nIrugA dImanasu |
cuTTi cuTTi pAyakuMDu juTamUgA dImanasu | yeTTaneduTanE vuMDu nETidO yImanasu ||
ca|| ruculellA gAnupiMcu rUpu lEdu manasu | pacariMcu nAsalellA basiDigA dImanasu |
yecaTA garagadu rAyIgAdu manasu | yicaTA nacaTA dAnE yETidO yImanasu ||
ca|| tappaka nAlO nuMDu daivamu gAdu manasu | kappi mUTagaTTarAdu gAlI gAdu manasu |
cepparAnimahimalaSrIvEMkaTESu dalaci | yippuDinniTA gelice nETidO yImanasu ||