ప|| కంటి నఖిలాండ తతి కర్తనధికుని గంటి | కంటి నఘములు వీడుకొంటి నిజమూర్తి గంటి ||
చ|| మహనీయ ఘన ఫణామణుల శైలము గంటి | బహు విభవముల మంటపములు గంటి |
సహజ నవరత్న కాంచన వేదికలు గంటి | రహి వహించిన గోపురములవె కంటి ||
చ|| పావనంబైన పాపవినాశము గంటి | కైవశంబగు గగన గంగ గంటి |
దైవికపు పుణ్యతీర్థములెల్ల బొడగంటి | కోవిదులు గొనియాడు కోనేరి గంటి ||
చ|| పరమ యోగీంద్రులకు భావగోచరమైన | సరిలేని పాదాంబుజముల గంటి |
తిరమైన గిరిచూపు దివ్యహస్తము గంటి | తిరు వేంకటాచలాధిపు జూడగంటి ||
pa|| kaMTi naKilAMDa tati kartanadhikuni gaMTi | kaMTi naGamulu vIDukoMTi nijamUrti gaMTi ||
ca|| mahanIya Gana PaNAmaNula Sailamu gaMTi | bahu viBavamula maMTapamulu gaMTi |
sahaja navaratna kAMcana vEdikalu gaMTi | rahi vahiMcina gOpuramulave kaMTi ||
ca|| pAvanaMbaina pApavinASamu gaMTi | kaivaSaMbagu gagana gaMga gaMTi |
daivikapu puNyatIrthamulella boDagaMTi | kOvidulu goniyADu kOnEri gaMTi ||
ca|| parama yOgIMdrulaku BAvagOcaramaina | sarilEni pAdAMbujamula gaMTi |
tiramaina giricUpu divyahastamu gaMTi | tiru vEMkaTAcalAdhipu jUDagaMTi ||
|