ప|| కంటి నిదే యర్థము ఘనశాస్త్రములు దవ్వి | నంటున నిందుకంటెను నాణె మెందూ లేదు ||
చ|| మేటివైరాగ్యముకంటే మిక్కిలి లాభము లేదు | గాటపువిజ్ఞానముకంటే సుఖము లేదు |
మీటైనగురువుకంటే మీద రక్షకుడు లేడు | బాటసంసారముకంటే పగ లేదు ||
చ|| పరపీడసేయుకంటే పాపము మరెందు లేదు | పరోపకారముకంటే బహుపుణ్యము లేదు |
నిరతశాంతముకంటే నిజధర్మ మెందు లేదు | హరిదాసుడౌకంటే నట గతి లేదు ||
చ|| కర్మసంగము మానుకంటే దేజము లేదు | అర్మిలి గోరికమానేయంతకంటే బుద్ధి లేదు |
ధర్మపు శ్రీవేంకటేశు దగిలి శరణుజొచ్చి | నిర్మలాస నుండుకంటే నిశ్చయము లేదు ||
pa|| kaMTi nidE yarthamu GanaSAstramulu davvi | naMTuna niMdukaMTenu nANe meMdU lEdu ||
ca|| mETivairAgyamukaMTE mikkili lABamu lEdu | gATapuvij~jAnamukaMTE suKamu lEdu |
mITainaguruvukaMTE mIda rakShakuDu lEDu | bATasaMsAramukaMTE paga lEdu ||
ca|| parapIDasEyukaMTE pApamu mareMdu lEdu | parOpakAramukaMTE bahupuNyamu lEdu |
nirataSAMtamukaMTE nijadharma meMdu lEdu | haridAsuDaukaMTE naTa gati lEdu ||
ca|| karmasaMgamu mAnukaMTE dEjamu lEdu | armili gOrikamAnEyaMtakaMTE buddhi lEdu |
dharmapu SrIvEMkaTESu dagili SaraNujocci | nirmalAsa nuMDukaMTE niScayamu lEdu ||