ప|| కంటిమి రెంటికి భూమి గలుగుదృష్టాంతరము | గొంటరిరావణునందు గుహునియందు ||
చ|| నీదాస్యము గలనీచజన్మమైన మేలు | యేదియునెఱగనట్టియెక్కువజన్మానకంటే |
వాదపుగర్వము లేదు వట్టియాచారము లేదు | సాధించి నైచాన్యుసంధానమేకాని ||
చ|| మిమ్ము దలపుచు జేయుమృగయానమైన మేలు | సొమ్ముపోక మీకుగని సుకృతము సేయుకంటె |
దిమ్మరిజన్మము లేదు తెగనికోరిక లేదు | పమ్మి నీపై బెట్టినట్టిభారమేకాని ||
చ|| దిక్కులు సాధించుకంటె తెలిసి శ్రీవేంకటేశు- | దిక్కు నీనామమే కా సాధించుటే మేలు |
యెక్కువ తక్కువ లేదు యెఱు కెఱుగమి లేదు | చక్కజాడతో నీకు శరణంటేగాని ||
pa|| kaMTimi reMTiki BUmi galugudRuShTAMtaramu | goMTarirAvaNunaMdu guhuniyaMdu ||
ca|| nIdAsyamu galanIcajanmamaina mElu | yEdiyunerxaganaTTiyekkuvajanmAnakaMTE |
vAdapugarvamu lEdu vaTTiyAcAramu lEdu | sAdhiMci naicAnyusaMdhAnamEkAni ||
ca|| mimmu dalapucu jEyumRugayAnamaina mElu | sommupOka mIkugani sukRutamu sEyukaMTe |
dimmarijanmamu lEdu teganikOrika lEdu | pammi nIpai beTTinaTTiBAramEkAni ||
ca|| dikkulu sAdhiMcukaMTe telisi SrIvEMkaTESu- | dikku nInAmamE kA sAdhiMcuTE mElu |
yekkuva takkuva lEdu yerxu kerxugami lEdu | cakkajADatO nIku SaraNaMTEgAni ||