ప|| ఒకటి బోలిచిన వేరొకటి తోచీని | సకలము బోలిచేము సుదతి సింగారాలు ||
చ|| కలువలు జకోరాలు గండుమీలు దామరలు | చలిముతైపు జిప్పలు సతికన్నులు |
అలలు నీలమణులంధకారము మేఘము | నలుపు రాశివో నలినాక్షి తురుము ||
చ|| జక్కవలు నిమ్మపండ్లు సరి బూగుత్తులు గొండ | లెక్కువ మరిమిద్దెలు యింతి చన్నులు |
చుక్కలు సురవొన్నలు సూది వజ్రాల గోళ్ళు | అక్కర యేనుగ తోండాలరంట్లే తొడలు ||
చ|| సోగ తీగెలు తూండ్లు సుదతి బాహువులిదె | చేగ చిగురు లత్తిక చెలి పాదాలు |
యీగతి శ్రీవేంకటేశ యింతి నీవురము మీద | బాగుగ నమరి పైడి పతిమ బోలినవి ||
pa|| okaTi bOlicina vErokaTi tOcIni | sakalamu bOlicEmu sudati siMgArAlu ||
ca|| kaluvalu jakOrAlu gaMDumIlu dAmaralu | calimutaipu jippalu satikannulu |
alalu nIlamaNulaMdhakAramu mEGamu | nalupu rASivO nalinAkShi turumu ||
ca|| jakkavalu nimmapaMDlu sari bUguttulu goMDa | lekkuva marimiddelu yiMti cannulu |
cukkalu suravonnalu sUdi vajrAla gOLLu | akkara yEnuga tOMDAlaraMTlE toDalu ||
ca|| sOga tIgelu tUMDlu sudati bAhuvulide | cEga ciguru lattika celi pAdAlu |
yIgati SrIvEMkaTESa yiMti nIvuramu mIda | bAguga namari paiDi patima bOlinavi ||