ప|| ఒక్కడే అంతర్యామి వుపకారి చేపట్టు | తక్కినవి యిన్నియును తలపు రేచెడిని ||
చ|| యెఱుగుమీ జీవుడా యింద్రియాలు సొమ్ము గావు | గుఱియై మాయలలోన గూడించే వింతె |
మఱవకు జీవుడా మనసు చుట్టము గాదు | తెఱగొప్ప ఆసలనే తిప్పెడి దింతె ||
చ|| తెలుసుకో జీవుడా దేహమును నమ్మరాదు | వలసితే నుండు బోవు వన్నెవంటిది |
తలచుకో జీవుడా ధనము దనిచ్చ గాదు | పలులంపటములచే బరచెడి దింతె ||
చ|| సమ్మతించు జీవుడా సంసార మొకజాడ గాదు | బిమ్మటి పొద్దొకజాడ పెనచు నింతె |
యిమ్ముల శ్రీవేంకటేశు డితనిమూలమే యింత | నెమ్మి దానే గతియంటే నిత్యమౌ నింతే ||
pa|| okkaDE aMtaryAmi vupakAri cEpaTTu | takkinavi yinniyunu talapu rEceDini ||
ca|| yerxugumI jIvuDA yiMdriyAlu sommu gAvu | gurxiyai mAyalalOna gUDiMcE viMte |
marxavaku jIvuDA manasu cuTTamu gAdu | terxagoppa AsalanE tippeDi diMte ||
ca|| telusukO jIvuDA dEhamunu nammarAdu | valasitE nuMDu bOvu vannevaMTidi |
talacukO jIvuDA dhanamu danicca gAdu | palulaMpaTamulacE baraceDi diMte ||
ca|| sammatiMcu jIvuDA saMsAra mokajADa gAdu | bimmaTi poddokajADa penacu niMte |
yimmula SrIvEMkaTESu DitanimUlamE yiMta | nemmi dAnE gatiyaMTE nityamau niMtE ||