ప|| ఒరసి చూడబోతే నొకటీ నిజము లేదు | పొరల మేను ధరించి పొరలగ బట్టెను ||
చ|| పాతకములటకొన్ని బలు పుణ్యాలట కొన్ని | యీతల స్వర్గనరకాలిచ్చేనట |
యేతుల నందుగొన్నాళ్ళు యిందు గొన్నాళ్ళు దేహికి | పోతరించి కాతరించి పొరలనే పట్టెను ||
చ|| పొలతులట కోందరు పురుషులట కొందరు | వెలుగును జీకట్లు విహారమట |
కలవరింతలుగొంత ఘన సంసారము గొంత | పొలసి జీవులు రెంటా బొరలగ బట్టెను ||
చ|| ఒక్కవంక జ్ఞానమట వొక్కవంక గర్మమట | మొక్కి యిహపరాలకు మూలమిదట |
తక్కక శ్రీ వేంకటేశు దాసులై గెలిచిరట | పుక్కిట నిన్నాళ్ళు రెంటా బొరలగ బట్టెను ||
pa|| orasi cUDabOtE nokaTI nijamu lEdu | porala mEnu dhariMci poralaga baTTenu ||
ca|| pAtakamulaTakonni balu puNyAlaTa konni | yItala svarganarakAliccEnaTa |
yEtula naMdugonnALLu yiMdu gonnALLu dEhiki | pOtariMci kAtariMci poralanE paTTenu ||
ca|| polatulaTa kOMdaru puruShulaTa koMdaru | velugunu jIkaTlu vihAramaTa |
kalavariMtalugoMta Gana saMsAramu goMta | polasi jIvulu reMTA boralaga baTTenu ||
ca|| okkavaMka j~jAnamaTa vokkavaMka garmamaTa | mokki yihaparAlaku mUlamidaTa |
takkaka SrI vEMkaTESu dAsulai geliciraTa | pukkiTa ninnALLu reMTA boralaga baTTenu ||