ప|| ఒసగితివిన్నియు ఒకమాటే | వెసనిక జేసే విన్నపమేది ||
చ|| నారాయణ నీ నామమె తలచిన | నీరాని వరము లిచ్చితివి |
చేరి నిన్నిట సేవించిన నిక | కోరి పడయనిక కోరికలేవి ||
చ|| హరి నీ కొకమరి యటు శరణంటే | గరిమల నన్నిటు గాచితివి |
నిరతముగా నిక నుతియింపుచు | అర గొరతని నిను అడిగేదో ||
చ|| శ్రీ వేంకటేశ్వర చేయెత్తి మ్రొక్కిన | భావమె నీవై పరగితివి |
ఈ వరుసల నీవింతటి దాతవు | ఆవాలనిను కొనియాడేడి దేమి ||
pa|| osagitivinniyu okamATE | vesanika jEsE vinnapamEdi ||
ca|| nArAyaNa nI nAmame talacina | nIrAni varamu liccitivi |
cEri ninniTa sEviMcina nika | kOri paDayanika kOrikalEvi ||
ca|| hari nI kokamari yaTu SaraNaMTE | garimala nanniTu gAcitivi |
niratamugA nika nutiyiMpucu | ara goratani ninu aDigEdO ||
ca|| SrI vEMkaTESvara cEyetti mrokkina | BAvame nIvai paragitivi |
I varusala nIviMtaTi dAtavu | Avaalaninu koniyADEDi dEmi ||