ప|| వెరవకు మనసా విష్ణుని అభయము | నెరవుగ యెదుటనే నిలిచి యున్నది ||
చ|| శ్రీపతి కరుణ జీవరాసులకు | దాపును దండై తగిలినది |
పైపై దేవుని బలు సంకల్పమె | చేపట్టి రక్షించ చెలగేది ||
చ|| నలినోదరు నిజ నామాంకితమే | ఇలపై దాసుల నేలేది |
కలిభంజను శంఖ చక్ర లాంఛన | మలవడి శుభముల నందించేది ||
చ|| శ్రీవేంకటపతి చేసిన చేతలే | వేవేల చందాల వెలసినది |
భూవిభుడితడు పూనిన మహిమలె | కైవసమై మము గాచేది ||
pa|| veravaku manasA viShNuni aBayamu | neravuga yeduTanE nilici yunnadi ||
ca|| SrIpati karuNa jIvarAsulaku | dApunu daMDai tagilinadi |
paipai dEvuni balu saMkalpame | cEpaTTi rakShiMca celagEdi ||
ca|| nalinOdaru nija nAmAMkitamE | ilapai dAsula nElEdi |
kaliBaMjanu SaMKa cakra lAMCana | malavaDi SuBamula naMdiMcEdi ||
ca|| SrIvEMkaTapati cEsina cEtalE | vEvEla caMdAla velasinadi |
BUviBuDitaDu pUnina mahimale | kaivasamai mamu gAcEdi ||