ఎన్నడొకో నే దెలిసి యెక్కుడయి బ్రదికేది
పన్నిననాగుణమెల్లా భ్రమత పాలాయ||
ధనమద మిదె నన్ను దైవము నెఱ గనీదు
తనుమద మెంతయిన తపము జేయనీదు
ఘన సంసారమదము కలుషము బాయనీదు
మవెడినామనువెల్ల మదముపాలాయ||
పొంచి కామాంధకారము పుణ్యము గానగనీదు
కంచపుజన్మపుచిక్కు గతి చూపదు
పెంచి యజ్ఞానతనము పెద్దల నెరగనీదు
చించరానినాబుద్ది చీకటిపాలాయ||
శ్రీ వేంకటేశ్వరమాయ చిత్తము దేరనీదు
యేవంకా నీతడే గతి యిన్నిటా మాకు
యేవుపాయమును లేక యీతని మఱగు చొచ్చి
దేవుడంతర్యామి యని తేజము బొందితిమి||
Ennadoko nae delisi yekkudayi bradikaedi
Panninanaagunamellaa bhramata paalaaya||
Dhanamada mide nannu daivamu ne~ra ganeedu
Tanumada memtayina tapamu jaeyaneedu
Ghana samsaaramadamu kalushamu baayaneedu
Mavedinaamanuvella madamupaalaaya||
Pomchi kaamaamdhakaaramu punyamu gaanaganeedu
Kamchapujanmapuchikku gati choopadu
Pemchi yaj~naanatanamu peddala neraganeedu
Chimcharaaninaabuddi cheekatipaalaaya||
Sree vaemkataesvaramaaya chittamu daeraneedu
Yaevamkaa neetadae gati yinnitaa maaku
Yaevupaayamunu laeka yeetani ma~ragu chochchi
Daevudamtaryaami yani taejamu bomditimi||