ప|| ఎన్నడు జెడని యీవులిచ్చీని మాధవుడు | పన్నిన యాస లితనిపైపై నిలుపవో ||
చ|| కొననాలుకా! హరిగుణములే నుడుగవో | మనసా! ఆతని దివ్య మహిమెంచవో |
తనువా! శ్రీపతి తీర్థదాహమే కోరవో | యెనలేని అడియాస లేటికి నీకికను ||
చ|| వీనులారా! యేపొద్దు విష్ణుకథలే వినరో | ఆనినచేతు లితనికంది మొక్కరో |
కానుక చూపులాల కమలాక్షు జూడరో | యీ నేటి పాపాల బారినేల పడేరికను ||
చ|| నలిబాదాలాల! హరి నగరికే నడవరో | కలభక్తి యాతనిపై ఘటియించరో |
చలమా! శ్రీవేంకటేశు సంగతినే వుండవో | యెలయింపు గోరికలకేల పారేవికను ||
pa|| ennaDu jeDani yIvuliccIni mAdhavuDu | pannina yAsa litanipaipai nilupavO ||
ca|| konanAlukA! hariguNamulE nuDugavO | manasA! Atani divya mahimeMcavO |
tanuvA! SrIpati tIrthadAhamE kOravO | yenalEni aDiyAsa lETiki nIkikanu ||
ca|| vInulArA! yEpoddu viShNukathalE vinarO | AninacEtu litanikaMdi mokkarO |
kAnuka cUpulAla kamalAkShu jUDarO | yI nETi pApAla bArinEla paDErikanu ||
ca|| nalibAdAlAla! hari nagarikE naDavarO | kalaBakti yAtanipai GaTiyiMcarO |
calamA! SrIvEMkaTESu saMgatinE vuMDavO | yelayiMpu gOrikalakEla pArEvikanu ||