ప|| సుఖమును దుఃఖమును జోడుకోడెలు | అఖిలముగన్నవారు అడ్డమాడ రెపుడు ||
చ|| యెందాకా సంసార మెనసి తా జేసేను | అందాకా లంపటము లవి వోవు |
కందువజీవుడు భూమి గాయ మెన్నాళ్ళు మోచె | అందుకొన్నతనలోని యాసలూ బోవు ||
చ|| అప్పటి దనకు లోలో ఆక లెంతగలిగినా | తప్పక అందుకు దగ దాహము బోదు |
అప్పు దనమీద మోచి అదె యెన్నాళ్ళు వుండె | ముప్పిరి వడ్డివారక మూలనుండినా బోదు ||
చ|| దైవముపై భక్తిలేక తనకు నెన్నాళ్ళుండే | దావతి కర్మపుపాటు తనకు బోదు |
శ్రీవేంకటేశ్వరునిసేవ దనకెప్పుడబ్బె | వోవరి నందలిమేలు వొల్లనన్నాబోదు ||
pa|| suKamunu duHKamunu jODukODelu | aKilamugannavAru aDDamADa repuDu ||
ca|| yeMdAkA saMsAra menasi tA jEsEnu | aMdAkA laMpaTamu lavi vOvu |
kaMduvajIvuDu BUmi gAya mennALLu mOce | aMdukonnatanalOni yAsalU bOvu ||
ca|| appaTi danaku lOlO Aka leMtagaliginA | tappaka aMduku daga dAhamu bOdu |
appu danamIda mOci ade yennALLu vuMDe | muppiri vaDDivAraka mUlanuMDinA bOdu ||
ca|| daivamupai BaktilEka tanaku nennALLuMDE | dAvati karmapupATu tanaku bOdu |
SrIvEMkaTESvarunisEva danakeppuDabbe | vOvari naMdalimElu vollanannAbOdu ||