ప|| సులభమా మనుజులకు హరిభక్తి | వలనొంది మరికదా వైష్ణవుడౌట ||
చ|| కొదలేని తపములు కోటాన గోటులు | నదన నాచరించి యటమీద |
పదిలమైన కర్మల బంధములన్నియు | వదిలించుకొని కదా వైష్ణవుడౌట ||
చ|| తనివోని యాగతంత్రములు లక్షలసంఖ్య | అనఘుడై చేసిన యటమీదట |
జననములన్నిట జనియించి పరమ పా- | వనుడై మరికద వైష్ణవుడౌట ||
చ|| తిరిగి తిరిగి పెక్కుతీర్థములన్నియు | నరలేక సెవించినమీదట |
తిరువేంకటాచలాధిపుడైన కరిరాజ- | వరదుని కృపగద వైష్ణవుడౌట ||
pa|| sulaBamA manujulaku hariBakti | valanoMdi marikadA vaiShNavuDauTa ||
ca|| kodalEni tapamulu kOTAna gOTulu | nadana nAcariMci yaTamIda |
padilamaina karmala baMdhamulanniyu | vadiliMcukoni kadA vaiShNavuDauTa ||
ca|| tanivOni yAgataMtramulu lakShalasaMKya | anaGuDai cEsina yaTamIdaTa |
jananamulanniTa janiyiMci parama pA- | vanuDai marikada vaiShNavuDauTa ||
ca|| tirigi tirigi pekkutIrthamulanniyu | naralEka seviMcinamIdaTa |
tiruvEMkaTAcalAdhipuDaina karirAja- | varaduni kRupagada vaiShNavuDauTa ||