Posts

Showing posts from May, 2010

nityAtmuDai yumDi - నిత్యాత్ముఁడై యుండి

Image
ప : నిత్యాత్ముఁడై యుండి నిత్యుఁడై వెలుఁగొందు - సత్యాత్ముఁడై యుండి సత్యమై తానుండు ప్రత్యక్షమై యుండి బ్రహ్మమై యుండు సం- స్తుత్యుఁ డీతిరువేంకటాద్రివిభుఁడు చ : ఏమూర్తి లోకంబులెల్ల నేలెడునాతఁ- డేమూర్తి బ్రహ్మాదులెల్ల వెదకెడునాతఁ- డేమూర్తి నిజమోక్షమియ్యఁ జాలెడునాతఁ- డేమూర్తి లోకైకహితుఁడు యేమూర్తి నిజమూర్తి యేమూర్తియునుఁ గాఁడు - యేమూర్తి త్రైమూర్తు లేకమైనయాతఁ- డేమూర్తి సర్వాతుఁ డేమూర్తి పరమాత్ముఁ- డామూర్తి తిరువేంకటాద్రివిభుఁడు చ : యేదేవుదేహమున నిన్ని యును జన్మించె - నేదేవుదేహమున నిన్నియును నణఁగె మరి యేదేవువిగ్రహం బీసకల మింతయును - యేదేవునేత్రంబు లినచంద్రులు యేదేవుఁ డీజీవులిన్నింటిలో నుండు - నేదేవుచైతన్య మిన్నిటికి నాధార- మేదేవుఁ డవ్యక్తుఁ డేదేవుఁ డద్వంద్వుంఁ- డాదేవుఁ డీవేంకటాద్రివిభుఁడు చ : యేవేల్పుపాదయుగ మిలయునాకాశంబు - యేవేల్పుపాదకేశాంతం బనంతంబు యేవేల్పునిశ్వాస మీమహామారుతము - యేవేల్పునిజదాసు లీపుణ్యులు యేవేల్పు సర్వేశుఁ డేవేల్పు పరమేశుఁ- డేవేల్పు భువనైకహితమనోభావకుఁడు యేవేల్పు కడుసూక్ష్మ మేవేల్పు కడుఘనము - ఆవేల్పు తిరువేంకటాద్రివిభుఁడు pa : nityAtmu@mDai yumDi nityu@mDai velu@Mgomdu - satyAt...

nE nokkaDa lEkuMDitE - నే నొక్కడ లేకుండితే

Image
నే నొక్కడ లేకుండితే నీకృపకు పాత్ర మేది పూని నావల్లనే కీర్తి బొందేవు నీవు అతి మూఢులలోన నగ్రేసరుడ నేను ప్రతిలేనిఘనగర్వపర్వతమను తతి బంచేంద్రియములధనవంతుడను నేను వెతకి నావంటివాని విడువగ జెల్లునా మహిలో సంసారపుసామ్రాజ్యమేలేవాడ నేను యిహమున గర్మవహికెక్కితి నేను బహుయోనికూపసంపద దేలేవాడ నేను వహించుక నావంటివాని దేనోపేవా భావించి నావంటినీచు బట్టి కాచినప్పుడుగా యేవంక నీకీర్తి గడువెంతురు భువి నావల్ల నీకు బుణ్యము నీవల్లనే బ్రదుకుదు శ్రీవేంకటేశుడ యింత చేరె జుమ్మీ మేలు nE nokkaDa lEkuMDitE nIkRpaku pAtra mEdi pUni nAvallanE kIrti boMdEvu nIvu ati mUDhulalOna nagrEsaruDa nEnu pratilEnighanagarvaparvatamanu tati baMchEMdriyamuladhanavaMtuDanu nEnu vetaki nAvaMTivAni viDuvaga jellunA mahilO saMsaarapusAmrAjyamElEvADa nEnu yihamuna garmavahikekkiti nEnu bahuyOnikUpasaMpada dElEvADa nEnu vahiMchuka nAvaMTivAni dEnOpEvA bhAviMchi nAvaMTinIchu baTTi kAchinappuDugA yEvaMka nIkIrti gaDuveMturu bhuvi nAvalla nIku buNyamu nIvallanE bradukudu SrIvEMkaTESuDa yiMta chEre jummI mElu

talachichUDa paratatwaMbitaDu - తలచిచూడ పరతత్వంబితడు

Image
తలచిచూడ పరతత్వంబితడు వలసినవారికి వరదుడితడు సిరికి మగడమృతసింధువునకు నల్లుడు సరుస పార్వతికి సయిదోడు గరిమెల బ్రహ్మకుఁ గన్న తండ్రి యితడు పరగి శివునకు బావ యితడు అల దేవేంద్రుని యనుజుడితడు మలసి చంద్రుని మఱదితడు కులమున నదితికి కొడుకూ నితడు తలపు సురాసురలతాతయు నితడు ప్రాణుల కెల్లా బంధుడితడు వాణికి మామగు వావి యితడు జాణ శ్రీవేంకటాచల రమణుడితడు మాణికపు మన్మథుడితడు talachichUDa paratatwaMbitaDu valasinavAriki varaduDitaDu siriki magaDamRtasiMdhuvunaku nalluDu sarusa pArwatiki sayidODu garimela brahmaku@M ganna taMDri yitaDu paragi Sivunaku bAva yitaDu ala dEvEMdruni yanujuDitaDu malasi chaMdruni ma~raditaDu kulamuna naditiki koDukU nitaDu talapu surAsuralatAtayu nitaDu prANula kellA baMdhuDitaDu vANiki mAmagu vAvi yitaDu jANa SrIvEMkaTAchala ramaNuDitaDu mANikapu manmathuDitaDu

jnAnayajnamIgati mOkshasAdhanamu - జ్ఞానయజ్ఞమీగతి

Image
ప|| జ్ఞానయజ్ఞమీగతి మోక్షసాధనము | నానార్థములు నిన్నే నడపె మాగురుడు || చ|| అలరి దేహమనేటి యాగశాలలోన | బలువై యజ్ఞానపుపశువు బంధించి | కలసి వైరాగ్యపుకత్తుల గోసికోసి | వెలయు జ్ఞానాగ్నిలో వేలిచె మాగురుడు || చ|| మొక్కుచు వైష్ణవులనేమునిసభ గూడపెట్టి | చొక్కుచు శ్రీపాదతీర్థ సోమపానము నించి | చక్కగా సంకీర్తనసామగానము చేసి | యిక్కువతో యజ్ఞము సేయించెబో మాగురుడు || చ|| తదియ్యగురు ప్రసాదపు పురోడాశమిచ్చి | కొదదీర ద్వయమనుకుండలంబులు వెట్టి | యెదలో శ్రీవేంకటేశు నిటు ప్రత్యక్షముచేసె | యిదివో స్వరూపదీక్ష యిచ్చెను మా గురుడు | | pa|| j~nAnayaj~namIgati mOkshasAdhanamu | nAnaarthamulu ninnE naDape mAguruDu || cha|| alari dEhamanETi yAgaSAlalOna | baluvai yaj~nAnapupaSuvu baMdhiMchi | kalasi vairAgyapukattula gOsikOsi | velayu j~nAnAgnilO vEliche mAguruDu || cha|| mokkuchu vaishNavulanEmunisabha gUDapeTTi | chokkuchu SrIpAdatIrtha sOmapAnamu niMchi | chakkagaa saMkIrtanasAmagAnamu chEsi | yikkuvatO yaj~namu sEyiMchebO mAguruDu || cha|| tadiyyaguru prasaadapu purODaaSamichchi | kodadIra dvayamanukuMDalaMbulu veTTi ...

rAnu mIkaDaku O ramaNulAra - రాను మీకడకు

Image
రాను మీకడకు ఓ రమణులార, పూవుఁ బానుపు హరికినేఁ బఱవవలయును నేడు చెలగి దేవుడు నేడు సిరితో నేటికి నో పొలయలుకలవలపులు నటియించి తలపోత విరహవేదనలనున్నాడు ఈ చలిమందు లతనికి చాతవలయు నేడు రమణుడిప్పుడు యిందిరాదేవియెదుటను తమకించి యెవ్వతెనో తలంచెనట కమల కోపింప గాకల నారగింపడు ఈ హిమజల అతనికి యీయవలయును నేడు వెలదిబాసి తిరువేంకటేశ్వరుడు కలికియై కౌగిటఁ గలసెనట తిలకము గరగేటి తిరుమేనిచెమట యీ వెలినుండి పలుమారు విసరవలయు నేడు rAnu mIkaDaku O ramaNulAra, pUvu@M bAnupu harikinE@M ba~ravavalayunu nEDu chelagi dEvuDu nEDu siritO nETiki nO polayalukalavalapulu naTiyiMchi talapOta virahavEdanalanunnADu I chalimaMdu lataniki chAtavalayu nEDu ramaNuDippuDu yiMdirAdEviyeduTanu tamakiMchi yevvatenO talamchenaTa kamala kOpiMpa gAkala nAragiMpaDu I himajala ataniki yIyavalayunu nEDu veladibAsi tiruvEMkaTESwaruDu kalikiyai kaugiTa@M galasenaTa tilakamu garagETi tirumEnichemaTa yI velinuMDi palumAru visaravalayu nEDu

talachina talapulu - తలచిన తలపులు

Image
తలచిన తలపులుఁ దలకూడె వెలుపలె లోపలె వెరగికనేలే వలచిన వలపులు వడ్డికి బారీ తలుపుఁదెరవవే తరుణి యిక పిలువక వచ్చెను ప్రియుడు వాకిటికి నిలువుల బిగువులు నీ కిక నేలే ముసి ముసి నగవులు మోవులనుండగ ముసుగిడనేలే ముదిత యిక రసములు గురిసీ రమణుడు నీతో దొసగుల సుద్దులు తుదనికనేలే కరగిన చెమటలు కాగిట నున్నవి నిరతి మరగేలే నెలత యిక యిరవుగ శ్రీ వెంకటేశుడు గూడెను ధరలో గొంటివి తడబాటేలే talachina talapulu@M dalakooDe velupale lOpale veragikanaelae valachina valapulu vaDDiki baaree talupu@Mderavavae taruNi yika piluvaka vachchenu priyuDu vaakiTiki niluvula biguvulu nee kika naelae musi musi nagavulu mOvulanuMDaga musugiDanaelae mudita yika rasamulu gurisee ramaNuDu neetO dosagula suddulu tudanikanaelae karagina chemaTalu kaagiTa nunnavi nirati maragaelae nelata yika yiravuga Sree veMkaTaeSuDu gooDenu dharalO goMTivi taDabaaTaelae Sung by:Sri Mangalampalli Balamuralikrishna Get this widget | Track details | eSnips Social DNA

sadAnaMdamu sarwESvarA - సదానందము సర్వేశ్వరా

Image
సదానందము సర్వేశ్వరా నీ పదారవిందముపై భక్తి నయనానందము నరులకు సురలకు జయమగు హరి నీ సాకారము నయమగు శ్రవణానందము వినినను క్రియగలిగిన నీ కీర్తనము చెలగి అందరికి జిహ్వానందము పలుమరుఁ గొను నీ ప్రసాదము నలుగడ దేహానందము బుధులకు బలునీపాద ప్రణామములు ధర పరమానందము నీ దాస్యము గరిమల శ్రీవేంకటవిభుడా నరహరి నిత్యానందము నినుఁ దగ - నరవిరి జేయు సమారాధనము sadAnaMdamu sarwESvarA nI padAraviMdamupai bhakti nayanAnaMdamu narulaku suralaku jayamagu hari nI sAkAramu nayamagu SravaNAnaMdamu vininanu kriyagaligina nI kIrtanamu chelagi aMdariki jihvAnaMdamu palumaru@M gonu nI prasAdamu nalugaDa dEhAnaMdamu budhulaku balunIpAda praNAmamulu dhara paramAnaMdamu nI dAsyamu garimala SrIvEMkaTavibhuDA narahari nityAnaMdamu ninu@M daga - naraviri jEyu samArAdhanamu Sung by:G. Janaki Ramana Get this widget | Track details | eSnips Social DNA

rachchalu sEyaka rAvayyA - రచ్చలు సేయక

Image
రచ్చలు సేయక రావయ్యా యిచ్చ యెఱగ నిది యేలయ్యా జంకెన చూపులు సరసపుమాటలు లంకెలఁబెట్టీ లలితాంగి మంకులవొట్లు మాయల అలుకలు యింకా నీపెతో నేలయ్యా దొంతులయాసలు దోమటిబాసలు సంతము సేసీ జవరాలు పంతపు బిగువులు పాయపుమదములు యెంతకెంత మరి యేలయ్యా చనవులసవిగెలు చాయలసన్నలు పెనవులఁ బెట్టీ ప్రియురాలు యెనసితి శ్రీవేంకటేశ యీపె నిదె యినుమడిపరవశ మేలయ్యా rachchalu sEyaka rAvayyA yichcha ye~raga nidi yElayyA jaMkena chUpulu sarasapumATalu laMkela@MbeTTI lalitAMgi maMkulavoTlu mAyala alukalu yiMkA nIpetO nElayyA doMtulayAsalu dOmaTibAsalu saMtamu sEsI javarAlu paMtapu biguvulu pAyapumadamulu yeMtakeMta mari yElayyA chanavulasavigelu chAyalasannalu penavula@M beTTI priyurAlu yenasiti SrIvEMkaTESa yIpe nide yinumaDiparavaSa mElayyA

ETi braduku yETi braduku - ఏటి బ్రదుకు

ఏటి బ్రదుకు యేటి బ్రదుకు ! వొక్క - మాట లోనే యటమటమైన బ్రదుకు సంతకూటములే చవులయిన బ్రదుకు దొంతిభయములతోడి బ్రదుకు ముంతనీళ్ళనే మునిగేటి బ్రదుకు వంతఁ బొరలి కడవర(ల)లేని బ్రదుకు మనసుచంచలమే మనువయిన బ్రదుకు దినదినగండాలఁ దీరు బ్రదుకు తనియ కాసలనె తగిలేటి బ్రదుకు వెనక ముందర చూడ వెరపయిన బ్రదుకు తెగి చేదెతీపయి తినియేటి బ్రదుకు పగవారి పంచల పాలైన బ్రదుకు తగువేంకటేశ్వరుఁ దలచని బ్రదుకు పొగకు నోపక మంటఁ బొగిలేటి బ్రదుకు E Ti braduku yETi braduku ! vokka - mATa lOnE yaTamaTamaina braduku saMtakUTamulE chavulayina braduku doMtibhayamulatODi braduku muMtanILLanE munigETi braduku vaMta@M borali kaDavara(la)lEni braduku manasuchaMchalamE manuvayina braduku dinadinagaMDAla@M dIru braduku taniya kAsalane tagilETi braduku venaka muMdara chUDa verapayina braduku tegi chEdetIpayi tiniyETi braduku pagavAri paMchala pAlaina braduku taguvEMkaTESwaru@M dalachani braduku pogaku nOpaka maMTa@M bogilETi braduku Sung by: R Viswanath Get this widget | Track details | eSnips Social DNA

ADarAnimATadi gu~rutu - ఆడరానిమాటది

Image
ఆడరానిమాటది గుఱుతు వేడుకతోనే విచ్చేయమనవే కాయజకేలికిఁ గడుఁ దమకించగ ఆయములంటిన దది గుఱుతు పాయపు పతికినిఁ బరిణాముచెప్పి మోయుచు తనకిటు మొక్కితిననవే దప్పిమోవితో తా ననుఁ దిట్టగ - నప్పుడు నవ్విన దది గుఱుతు యిప్పుడు దనరూ పిటు దలచి బయలు చిప్పిల గాగిటఁ జేర్చితిననవే పరిపరివిధముల పలుకులుఁ గులుకగ అరమరచి చొక్కినదది గుఱుతు పరగ శ్రీవేంకటపతి కడపలోన సరవిగూడె నిక సమ్మతియనవే ADarAnimATadi gu~rutu vEDukatOnE vichchEyamanavE kAyajakEliki@M gaDu@M damakiMchaga AyamulaMTina dadi gu~rutu pAyapu patikini@M bariNAmucheppi mOyuchu tanakiTu mokkitinanavE dappimOvitO tA nanu@M diTTaga - nappuDu navvina dadi gu~rutu yippuDu danarU piTu dalachi bayalu chippila gAgiTa@M jErchitinanavE pariparividhamula palukulu@M gulukaga aramarachi chokkinadadi gu~rutu paraga SrIvEMkaTapati kaDapalOna saravigUDe nika sammatiyanavE

kuMdanapu pilla@MgrOvi - కుందనపు పిల్లగ్రోవి

Image
కుందనపు పిల్లఁగ్రోవి గోపినాథా ! మాపై చిందేవు మోహరసాలు చిన్ని గోపినాథా కొలనిలోపలిమాతో గోపినాథా ! యేల కులికినవ్వు నవ్వేవు గోపినాథా కొలువు మొక్కు మొక్కేము గోపినాథా ! నీ చలము చెల్లితేఁ జాలు జాణ గోపినాథా గొబ్బన మాచీరలిమ్ము గోపినాథా ! మా గుబ్బలపైఁ గాక రేగె గోపినాథా గుబ్బతిల్లీ తమకమే గోపినాథా నీ కబ్బితి మేమైన చేయవయ్య గోపినాథా కుప్పవడె మాసిగ్గు గోపినాథా ! మా కొప్పు జారె ముడువుమా గోపినాథా వొప్పుగ శ్రీవేంకటాద్రి నుండి వచ్చి కూడితివి అప్ప తొండమారేగుళ్ళా ఆది గోపినాథా kuMdanapu pilla@MgrOvi gOpinAthA ! mApai chiMdEvu mOharasAlu chinni gOpinAthA kolanilOpalimAtO gOpinAthA ! yEla kulikinavvu navvEvu gOpinAthA koluvu mokku mokkEmu gOpinAthA ! nI chalamu chellitE@M jAlu jANa gOpinAthA gobbana mAchIralimmu gOpinAthA ! mA gubbalapai@M gAka rEge gOpinAthA gubbatillI tamakamE gOpinAthA nI kabbiti mEmaina chEyavayya gOpinAthA kuppavaDe mAsiggu gOpinAthA ! mA koppu jAre muDuvumA gOpinAthA voppuga SrIvEmkaTAdri nuMDi vachchi kUDitivi appa toMDamArEguLLA Adi gOpinAthA