Posts

Showing posts with the label Sobharaju

sri madvatiya - శ్రీ మద్వతీయ Annamayya Slokam

Image
  Sri Madvatiya - శ్రీ మద్వతీయ Annamayya Slokam శ్రీ మద్వతీయ చరితామృత మన్నయార్య పీత్వాపినైవ సుహితా మనుజాభ వేయుః ॥ త్వం వేంకట చలపతే రివ భక్తి సారం శ్రీ తాళ్లపాక గురుదేవ నమో నమస్తే నమో నమస్తే Śrī madvatīya caritāmr̥ta mannayārya pītvāpinaiva suhitā manujābha vēyuḥ॥ tvaṁ vēṅkaṭa calapatē riva bhakti sāraṁ śrī tāḷlapāka gurudēva namō namastē namō namastē Listen Audio by Sobharaju: Your browser does not support the audio element.

siruta navvulavADu - సిరుత నవ్వులవాడు

సిరుత నవ్వులవాడు (రాగం: ) (తాళం : ) ప|| సిరుత నవ్వులవాడు సిన్నెకా వీడు | వెరపెరుగడు సూడవే సిన్నెకా || చ|| పొలసు మేనివాడు బోరవీపు వాడు | సెలసు మోరవాడు సిన్నెకా | గొలుసుల వంకల కోరలతోబూమి | వెలిసినాడు సూడవే సిన్నెకా || చ|| మేటి కురుచవాడు మెడమీది గొడ్డలి | సీటకాలవాడు సిన్నెకా | ఆటదానిబాసి అడవిలో రాకాశి | వేటలాడీ జూడవే సిన్నెకా || చ|| బింకపు మోతల పిల్లగోవివాడు | సింక సూపులవాడు సిన్నెకా | కొంకక కలికియై కొసరి కూడె నన్ను | వేంకటేశుడు సూడవే సిన్నెకా || siruta navvulavADu (Raagam: ) (Taalam: ) pa|| siruta navvulavADu sinnekA vIDu | veraperugaDu sUDavE sinnekA || ca|| polasu mEnivADu bOravIpu vADu | selasu mOravADu sinnekA | golusula vaMkala kOralatObUmi | velisinADu sUDavE sinnekA || ca|| mETi kurucavADu meDamIdi goDDali | sITakAlavADu sinnekA | ATadAnibAsi aDavilO rAkASi | vETalADI jUDavE sinnekA || ca|| biMkapu mOtala pillagOvivADu | siMka sUpulavADu sinnekA | koMkaka kalikiyai kosari kUDe nannu | vEMkaTESuDu sUDavE sinnekA || Listen Audio by Sobharaju: Your browse...

brahma kaDigina - బ్రహ్మకడిగిన

బ్రహ్మకడిగిన (రాగం: ) (తాళం : ) ప|| బ్రహ్మకడిగిన పాదము | బ్రహ్మము దానె నీ పాదము || చ|| చెలగి వసుధ గొలిచిన నీ పాదము | బలితల మోపిన పాదము | తలకక గగనము తన్నిన పాదము | బలరిపు గాచిన పాదము || చ|| కామిని పాపము కడిగిన పాదము | పాముతల నిడిన పాదము | ప్రేమపు శ్రీసతి పిసికెడి పాదము | పామిడి తురగపు పాదము || చ|| పరమ యోగులకు పరి పరి విధముల | వర మొసగెడి నీ పాదము | తిరు వేంకటగిరి తిరమని చూపిన | పరమ పదము నీ పాదము || brahmakaDigina (Raa gam: ) (Taalam: ) pa|| brahmakaDigina pAdamu | brahmamu dAne nI pAdamu || ca|| celagi vasudha golicina nI pAdamu | balitala mOpina pAdamu | talakaka gaganamu tannina pAdamu | balaripu gAcina pAdamu || ca|| kAmini pApamu kaDigina pAdamu | pAmutala niDina pAdamu | prEmapu SrIsati pisikeDi pAdamu | pAmiDi turagapu pAdamu || ca|| parama yOgulaku pari pari vidhamula | vara mosageDi nI pAdamu | tiru vEMkaTagiri tiramani cUpina | parama padamu nI pAdamu || Listen Audio by Sobharaju: Your browser does not support the audio element.

cAladA hari nAma - చాలదా హరి నామ

చాలదా హరి నామ రాగము : హమ్సధ్వని ప|| చాలదా హరి నామ సౌఖ్యామృతము దమకు | చాలదా హితవైన చవులెల్లను నొసగ || చ|| ఇది యొకటి హరి నామ మింతైన జాలదా | చెదరకీ జన్మముల చెరలు విడిపించ | మదినొకటె హరినామ మంత్రమది చాలదా | పదివేల నరక కూపముల వెడలించ || చ|| కలదొకటి హరినామ కనకాద్రి చాలదా | తొలగుమని దారిద్ర్యదోషంబు చెరుచ | తెలివొకటి హరినామదీప మది చాలదా | కలుషంపు కఠిన చీకటి పారద్రోల || చ|| తగువేంకటేశు కీర్తనమొకటి చాలదా | జగములో కల్పభూజంబు వలె నుండ | సొగసి యీవిభుని దాసుల కరుణ చాలదా | నగవు జూపులను నున్నతమెపుడు జూప || cAladA hari (Raagam: ) (Taalam: ) pa|| cAladA hari nAma sauKyAmRutamu damaku | cAladA hitavaina cavulellanu nosaga || ca|| idi yokaTi hari nAma miMtaina jAladA | cedarakI janmamula ceralu viDipiMca | madinokaTe harinAma maMtramadi cAladA | padivEla naraka kUpamula veDaliMca || ca|| kaladokaTi harinAma kanakAdri cAladA | tolagumani dAridryadOShaMbu ceruca | telivokaTi harinAmadIpa madi cAladA | kaluShaMpu kaThina cIkaTi pAradrOla || ca|| taguvEMkaTESu kIrtanamokaTi cAladA | jagamulO kalpaBUja...

gAlinE pOya galakAlamu - గాలినే పోయ గలకాలము

గాలినే పోయ (రాగం: ) (తాళం : ) ప|| గాలినే పోయ గలకాలము | తాలిమికి గొంతయు బొద్దులేదు || చ|| అడుసు చొరనే పట్టె నటునిటు గాళ్ళు | గుడుగుకొననే పట్టె గలకాలము | ఒడలికి జీవుని కొడయడైనహరి | దడవగా గొంతయు బొద్దులేదు || చ|| కలచి చిందనే పట్టె గడవగ నించగ బట్టె | కలుషదేహపుబాధ గలకాలము | తలపోసి తనపాలి దైవమైన హరి | దలచగా గొంతయు బొద్దులేదు | చ|| శిరము ముడువబట్టె చిక్కుదియ్యగ బట్టె | గరిమల గపటాల గలకాలము | తిరువేంకటగిరి దేవుడైనహరి | దరిచేరా గొంతయు బొద్దులేదు || gAlinE pOya (Raagam: ) (Taalam: ) pa|| gAlinE pOya galakAlamu | tAlimiki goMtayu boddulEdu || ca|| aDusu coranE paTTe naTuniTu gALLu | guDugukonanE paTTe galakAlamu | oDaliki jIvuni koDayaDainahari | daDavagA goMtayu boddulEdu || ca|| kalaci ciMdanE paTTe gaDavaga niMcaga baTTe | kaluShadEhapubAdha galakAlamu | talapOsi tanapAli daivamaina hari | dalacagA goMtayu boddulEdu | ca|| Siramu muDuvabaTTe cikkudiyyaga baTTe | garimala gapaTAla galakAlamu | tiruvEMkaTagiri dEvuDainahari | daricErA goMtayu boddulEdu || Listen Audio by Sobharaju:...

Komdalalo nelakonna - కొండలలో నెలకొన్న

కొండలలో నెలకొన్న (రాగం: ) (తాళం : ) కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు కొండలంత వరములు గుప్పెడువాడు కుమ్మర దాసుడైన కురువరతినంబి యిమ్మన్న వరములెల్ల నిచ్చినవాడు దొమ్ములు సేసినయట్టి తొండమాం చక్కురవర్తి రమ్మన్న చోటికి వచ్చి నమ్మినవాడు అచ్చపు వేడుకతోడ ననంతాళువారికి ముచ్చిలి వెట్టికి మన్ను మోచినవాడు మచ్చిక దొలక దిరుమలనంబి తోడుత నిచ్చనిచ్చ మాటలాడి నొచ్చినవాడు కంచిలోన నుండ దిరుకచ్చినంబి మీద కరుణించి తనయెడకు రప్పించిన వాడు ఎంచి యెక్కుడైన వేంకటేశుడు మనలకు మంచివాడై కరుణ బాలించినవాడు Komdalalo nelakonna (Raagam: ) (Taalam: ) Komdalalo nelakonna koneti rayadu vadu Komdalamta varamulu guppeduvadu Kummara dasudaina kuruvaratinambi Yimmanna varamulella niccinavadu Dommulu sesinayatti tomdamam cakkuravarti Rammanna cotiki vacci namminavadu Accapu vedukatoda nanamtaluvariki Muccili vettiki mannu mocinavadu Maccika dolaka dirumalanambi toduta Niccanicca mataladi noccinavadu Kamcilona numda dirukaccinambi mida Karunimci tanayedaku rappimcina vadu Emci yekkudaina vemkatesudu manalaku Mamcivadai...

OhO DEMDEM - ఓహో డేండేం

ఓహో డేండేం (రాగం: ) (తాళం : ) ప|| ఓహో డేండేం వొగి బ్రహ్మ మిదియని | సాహసమున శ్రుతి దాటెడిని || చ|| పరమున నరము బ్రకృతియు ననగా | వెరవుదెలియుటే వివేకము | పరము దేవుడును అపరము జీవుడు | తిరమైన ప్రకృతియె దేహము || చ|| జ్ఞానము జ్ఞేయము జ్ఞానగమ్యమును | పూని తెలియుటే యోగము | జ్ఞానము దేహాత్మ, జ్ఞేయము పరమాత్మ | జ్ఞానగమ్యమే సాధించుమనసు || చ|| క్షరము నక్షరమును సాక్షి పురుషుడని | సరవి దెలియుటే సాత్వికము | క్షరము ప్రపంచ, మక్షరము కూటస్థుడు | సిరిపురుషోత్తముడే శ్రీ వేంకటేశుడు || OhO DEMDEM (Raagam: ) (Taalam: ) pa|| OhO DEMDEM vogi brahma midiyani | sAhasamuna Sruti dATeDini || ca|| paramuna naramu brakRutiyu nanagA | veravudeliyuTE vivEkamu | paramu dEvuDunu aparamu jIvuDu | tiramaina prakRutiye dEhamu || ca|| j~jAnamu j~jEyamu j~jAnagamyamunu | pUni teliyuTE yOgamu | j~jAnamu dEhAtma, j~jEyamu paramAtma | j~jAnagamyamE sAdhiMcumanasu || ca|| kSharamu nakSharamunu sAkShi puruShuDani | saravi deliyuTE sAtvikamu | kSharamu prapaMca, makSharamu kUTasthuDu | siripuruShOttamuDE SrI vEMkaTESuDu || L...

Aemoko chigurutadharamuna - ఏమొకో చిగురుటధరమున

ఏమొకో చిగురుటధరమున (రాగం: ) (తాళం : ) ఏమొకో చిగురుటధరమున ఎడనెడకస్తూరి నిండెను భామిని విభునకు వ్రాసిన పత్రిక కాదు కదా కలికి చకోరాక్షికి కడకన్నులు కెంపైతోచిన చెలువంబిప్పుడిదేమో చింతింపరేచెలులు నలువున ప్రాణేశ్వరునిపై నాటినయాకొనచూపులు నిలువునపెరుకగనంటిన నెత్తురుకాదుకదా పడతికి చనుగవమెరుగులు పైపై పయ్యెద వెలుపల కడుమించిన విధమేమో కనుగొనరే చెలులు వుడుగని వేడుకతో ప్రియుడొత్తిన నఖశశిరేఖలు వెడలగవేసవికాలపు వెన్నెలకాదుకదా ముద్దియ చెక్కుల కెలకుల ముత్యపు జల్లుల చేర్పుల వొద్దికలాగులివేమో ఊహింపరే చెలులు గద్దరి తిరువేంకటపతి కొగిటియధరామృతముల అద్దిన సురతపు చెమటల అందము కాదు కదా Aemoko chigurutadharamuna (Raagam: ) (Taalam: ) Aemoko chigurutadharamuna edanedakastoori nimdenu Bhaamini vibhunaku vraasina patrika kaadu kadaa Kaliki chakoraakshiki kadakannulu kempaitochina Cheluvambippudidaemo chimtimparaechelulu Naluvuna praanaesvarunipai naatinayaakonachoopulu Niluvunaperukaganamtina netturukaadukadaa Padatiki chanugavamerugulu paipai payyeda velupala Kadumimchina vidhamaemo kanugonarae chelulu Vu...

Kulukaka nadavaro - కులుకక నడవరో

Image
కులుకక నడవరో (రాగం:దేసాళం ) (తాళం : ) కులుకక నడవరో కొమ్మలాలా జలజల రాలీని జాజులు మాయమ్మకు ఒయ్యనే మేను గదలీ నొప్పుగా నడవరో గయ్యాళి శ్రీపాదతాకు కాంతులాలా పయ్యెద చెఱగు జారీ భారపు గుబ్బల మిద అయ్యో చెమరించె మా యమ్మకు నెన్నుదురు చల్లెడి గందవొడియై జారీ నిలువరో పల్లకి వట్టిన ముద్దు బణతులాల మొల్లమైన కుందనపు ముత్యాల కుచ్చులదర గల్లనుచు గంకణాలు గదలీమాయమ్మకు జమళి ముత్యాల తోడి చమ్మాళిగ లిడరో రమణికి మణుల నారతు లెత్తరో అమరించి కౌగిట నలమేలు మంగనిదె సమకూడె వేంకటేశ్వరుడు మా యమ్మకు Kulukaka nadavaro (Raagam:desaalam ) (Taalam: ) Kulukaka nadavaro kommalaalaa Jalajala raaleeni jaajulu maayammaku Oyyanae maenu gadalee noppugaa nadavaro Gayyaali Sreepaadataaku kaamtulaalaa Payyeda che~ragu jaaree bhaarapu gubbala mida Ayyo chemarimche maa yammaku nennuduru Challedi gamdavodiyai jaaree niluvaro Pallaki vattina muddu banatulaala Mollamaina kumdanapu mutyaala kuchchuladara Gallanuchu gamkanaalu gadaleemaayammaku Jamali mutyaala todi chammaaliga lidaro Ramaniki manula naaratu lettaro Amarimchi kaugita ...

gAlinE pOya galakAlamu - గాలినే పోయ గలకాలము

గాలినే పోయ (రాగం: ) (తాళం : ) ప|| గాలినే పోయ గలకాలము | తాలిమికి గొంతయు బొద్దులేదు || చ|| అడుసు చొరనే పట్టె నటునిటు గాళ్ళు | గుడుగుకొననే పట్టె గలకాలము | ఒడలికి జీవుని కొడయడైనహరి | దడవగా గొంతయు బొద్దులేదు || చ|| కలచి చిందనే పట్టె గడవగ నించగ బట్టె | కలుషదేహపుబాధ గలకాలము | తలపోసి తనపాలి దైవమైన హరి | దలచగా గొంతయు బొద్దులేదు | చ|| శిరము ముడువబట్టె చిక్కుదియ్యగ బట్టె | గరిమల గపటాల గలకాలము | తిరువేంకటగిరి దేవుడైనహరి | దరిచేరా గొంతయు బొద్దులేదు || gAlinE pOya (Raagam: ) (Taalam: ) pa|| gAlinE pOya galakAlamu | tAlimiki goMtayu boddulEdu || ca|| aDusu coranE paTTe naTuniTu gALLu | guDugukonanE paTTe galakAlamu | oDaliki jIvuni koDayaDainahari | daDavagA goMtayu boddulEdu || ca|| kalaci ciMdanE paTTe gaDavaga niMcaga baTTe | kaluShadEhapubAdha galakAlamu | talapOsi tanapAli daivamaina hari | dalacagA goMtayu boddulEdu | ca|| Siramu muDuvabaTTe cikkudiyyaga baTTe | garimala gapaTAla galakAlamu | tiruvEMkaTagiri dEvuDainahari | daricErA goMtayu boddulEdu || Listen Audio by Sobharaju: ...

emoko chiguru tadharamuna - ఏముకో చిగురు టధరమున

ఏముకో చిగురు టధరమున - ఎడనెడ కస్తూ రి నిండెను భామిని విభునకు రాసిన - పత్రిక కాదు కదా ... కలికి చకోరాక్షికి కడ - కన్నులు కెంపై తోచెనే చెలువంబిప్పటిదేమో - చింతింపరే చలులు నలువున ప్రాణేశ్వరుపై - నాటిన ఆ కొనచూపులు నిలువుగపెరుకగనంటిన - నెత్తురు కాదుకదా .. పడతికి చనుగవ మెరుగులు - పైపై పయ్యెద వెలుపల కడుమించిన విధమేమో - కనుగొనరే చెలులు ఉడుగని వేడుకతో ప్రియు - డొత్తి న నఖ శశి రేఖలు వెడలగ వేసవి కాలపు -వెన్నెల కాదు కదా .. ముద్దియ చెక్కుల కెలకుల - ముత్యపు జల్లుల చేర్పులు ఒద్దిక బాగు లివేమో - ఊహింపరే చెలులు గద్దరి తిరువేంకటపతి - కౌగిటి అధరామృతముల అద్దిన సురతపు చెమటల - అందము కాదుకదా Emoko chigurutadharamuna edaneda kastoori nindenu Bhamini vibhunaku vrasina patrika kadu kada. ll Kaliki chakorakshiki Kada Kannulu Kempai tochina Cheluvambippudidemo chintimpare chelulu. Naluvuna praneshwarupai natina aa kona choopulu Nilovuna perukaga antina netturu kadukada ll Padatiki chanugava merugulu pai pai payyeda velupala Kaduminchina vidha memo kanugonare chelulu Udugani vedukato priyudottina nakha shashi rekha...

chaaladaa harinaama - చాలదా హరినామ

చాలదా హరినామ సౌఖ్యామృతము తమకు చాలదా హితవైన చవులెల్లను నొసగ .. ఇది యొకటి హరి నామ మింతైన జాలదా చెదరకీ జన్మముల చెరలు విడిపించ మదినొకటె హరినామ మింతైన జాలదా పదివేల నరక కూపముల వెడలించ .. కలదొకటి హరినామ కనకాద్రి చాలదా తొలగుమని దారిద్ర్యదోషంబు చెఱచ తెలివొకటి హరినామదీప మది చాలదా కలుషంపు కఠిన చీకటి పారద్రోల ... తగువేంకటేశు కీర్తనమొకటి చాలదా జగములో కల్ప భూజంబు వలెనుండ సొగసి యీవిభుని దాసుల కరుణ చాలదా నగవు జూపులను నున్నతమెపుడు జూప Listen Audio by Shobharaju Your browser does not support the audio element.

brahma kadigina paadamu - బ్రహ్మ కడిగిన పాదము

Image
బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానెని పాదము చెలగి వసుధ కొలిచిన నీ పాదము బలి తల మోపిన పాదము తలకగ గగనము తన్నిన పాదము బలరిపు గాచిన పాదము కామిని పాపము కడిగిన పాదము - పాము తలనిడిన పాదము ప్రేమతొ శ్రీ సతి పిసికెడి పాదము -పామిడి తురగపు పాదము పరమ యోగులకు పరి పరి విధముల - పరమొసగెడి నీ పాదము తిరువేంకటగిరి తిరమని చూపిన - పరమ పదము నీ పాదము brahmakaDigina paadamu brahmamu taaneni paadamu chelagi vasudha kolichina neepaadamu bali tala mOpina paadamu talakaga gaganamu tannina paadamu balaripu gaachina paadamu kaamini paapamu kaDigina paadamu - paamutalaniDina paadamu premato Sree sati pisikeDi paadamu -paamidituragapu paadamu parama yOgulaku pari pari vidhamula - paramosageDi neepaadamu tiruvaeMkaTagiri tiramani choopina - parama padamu nee paadamu Listen Audio by Sobharaju: Your browser does not support the audio element. Background of this song: Here annamayya is explaining the Greatness of the lotus feet of Lord VEnkaTEswara, an incarnation of the supreme lord NARAYANA. He glorifies t...