Posts

talachinavanniyu tanakorakE - Top/Popular/Annamayya/annamacarya/spiritual/devotional/traditional/songs/ lyrics/Audio/videos/telugu/english

Image
తలచినవన్నియు తనకొరకే వెలి దెలియుట తనలోఁ దెలియుట కొరకే ఉదయమందుట భవమౌడుగుటకొరకే చదువుట మేలువిచారించుకొరకే బ్రదుకుట పురుషార్థపరుడౌటకొరకే యెదిరిఁ గనుట తన్నెఱుగుటకొరకే తగులుట విడివడఁదలచుట కొరకే నొగులుట కర్మమనుభవించు కొరకే చిగురౌట కొమ్మయి చెలగుటా కొరకే బెగడుట దురితము పెడబాయు కొరకే యీవల జేయుట ఆవలి కొరకే ఆవలనుండుట యీవలి కొరకే యీవలనావల నెనయ తిరుగుటెల్ల శ్రీవేంకటేశ్వరుఁ జేరుటకొరకే talachinavanniyu tanakorakE veli deliyuTa tanalO@M deliyuTa korakE udayamaMduTa bhavamauDuguTakorakE chaduvuTa mEluvichAriMchukorakE bradukuTa purushArthaparuDauTakorakE yediri@M ganuTa tanne~ruguTakorakE taguluTa viDivaDa@MdalachuTa korakE noguluTa karmamanubhaviMchu korakE chigurauTa kommayi chelaguTA korakE begaDuTa duritamu peDabAyu korakE yIvala jEyuTa Avali korakE AvalanuMDuTa yIvali korakE yIvalanAvala nenaya tiruguTella SrIvEMkaTESwaru@M jEruTakorakE Rendered by: Sri Nukala Chinasatyanarayana Get this widget | Track details | eSnips Social DNA

naMdagOpanaMdanuDE nATibAluDu - Top/Popular/Annamayya/annamacarya/spiritual/devotional/traditional/songs/ lyrics/Audio/videos/telugu/english

Image
నందగోపనందనుడే నాటిబాలుడు ఇందునేడె రేపల్లె నేచి పెరిగెను పువ్వువంటి మఱ్ఱియాకు పొత్తిఁబవళించనేర్చె యెవ్వడోకాని తొల్లె యీబాలుడు మువ్వంక వేదములను ముద్దుమాటలాడనేర్చె యెవ్వరూ కొంతనేర్ప నేటికే వీనికి తప్పుటడుగు లిడగనేర్చె ధరణియందు నాకసమున నెప్పుగా రసాతలమున నొంటి తొల్లియో రెప్పలెత్తి చూడనేర్చె రేసీఁజెంద్రునందు పగలు గొప్పసూర్యునందు నింకఁ గొత్త నేర్పనేటికే మంచివెన్నబువ్వ లిపుడు మలసి యారగించనేర్చె నంచితముగ శ్రీవేంకటాద్రి మీదను యెంచి యప్పలప్పలనుచు యెనసి కాగిలించనేర్చె దించరానివురము మీద దివ్యకాంతను naMdagOpanaMdanuDE nATibAluDu iMdunEDe rEpalle nEchi perigenu puvvuvaMTi ma~r~riyAku potti@MbavaLiMchanErche yevvaDOkAni tolle yIbAluDu muvvaMka vEdamulanu muddumATalADanErche yevvarU koMtanErpa nETikE vIniki tappuTaDugu liDaganErche dharaNiyaMdu nAkasamuna neppugA rasAtalamuna noMTi tolliyO reppaletti chUDanErche rEsI@MjeMdrunaMdu pagalu goppasUryunaMdu niMka@M gotta nErpanETikE maMchivennabuvva lipuDu malasi yAragiMchanErche naMchitamuga SrIvEMkaTAdri mIdanu yeMchi yappalappalanuchu yenasi kAgiliMchanE...

kOri nIpai@M dolli nAku - Top/Popular/Annamayya/annamacarya/spiritual/devotional/traditional/songs/ lyrics/Audio/videos/telugu/english

Image
కోరి నీపైఁ దొల్లి నాకు కోపమున్నదా ఆరీతి ఱట్టు సేయగా నంటి నింతేకాక ఆనలేల పెట్టేవు అంత వేడుకొనలేల కానీయవయ్యా నీమాటుకు కాదనేమో నేనిట్టె మాటాడగాను నేరుపుతో నాపెచేతి - కాను కందుకొనగాను కసరితిగాక కొప్పుదువ్వి యెంతనన్ను కొస రొడబరచేవు చెప్పినట్టల్లా నీకుఁ జేయకుండేనా యిప్పుడు నావద్ద నుండి యెలమి నాపెమట్టెల - చప్పుడాలకించగాను జరసితిగాక వీడెమిచ్చి చేయినాపై వేసేవు శ్రీవేంకటేశ కూడితి విందులకు నియ్యకొనవలదా జాడతోడ నన్నేలి సంగడినున్నాపెమోము చూడగా నందుకు నిట్టె సొలసితిగాక kOri nIpai@M dolli nAku kOpamunnadA ArIti ~raTTu sEyagA naMTi niMtEkAka AnalEla peTTEvu aMta vEDukonalEla kAnIyavayyA nImATuku kAdanEmO nEniTTe mATADagAnu nEruputO nApechEti - kAnu kaMdukonagAnu kasaritigAka koppuduvvi yeMtanannu kosa roDabarachEvu cheppinaTTallA nIku@M jEyakuMDEnA yippuDu nAvadda nuMDi yelami nApemaTTela - chappuDAlakiMchagAnu jarasitigAka vIDemichchi chEyinApai vEsEvu SrIvEMkaTESa kUDiti viMdulaku niyyakonavaladA jADatODa nannEli saMgaDinunnApemOmu chUDagA naMduku niTTe solasitigAka Get this widget | Track...

jIvAtumai yuMDu chilukA - Top/Popular/Annamayya/annamacarya/spiritual/devotional/traditional/songs/ lyrics/Audio/videos/telugu/english

Image
జీవాతుమై యుండు చిలుకా నీ-వావలికి పరమాత్ముడై యుండు చిలుకా ఆతుమపంజరములోన నయమున నుండి నా-చేతనే పెరిగిన చిలుకా జాతిగా కర్మపు సంకెళ్ళ బడి కాలఁ జేతఁ బేదైతివే చిలుకా భాతిగా చదువులు పగలురేలును నా చేత నేరిచినట్టి చిలుకా రీతిగా దేహంబురెక్కలచాటున నుండి సీతుకోరువ లేని చిలుకా బెదరి అయిదుగిరికిని భీతి పొందుచు కడు జెదరగ జూతువే చిలుకా అదయులయ్యిన శత్రులారుగురికిగాక ఆడిచి(అదిరి)పడుదువే నీవు చిలుకా వదలకిటు యాహారవాంఛ నటు పదివేలు- వదరులు వదరేటి చిలుకా తుదలేని మమతలు తోరమ్ము సేసి నా తోగూడి మెలగిన చిలుకా నీవన నెవ్వరు నేనన నెవ్వరు నీవే నేనైయుందు చిలుకా శ్రీవెంకటాద్రి పై చిత్తములో నుండి సేవించుకొని గట్టి చిలుకా దైవమానుషములు తలపించి యెపుడు నా -తలపునఁబాయని చిలుకా యేవియును నిజముగా విని యేటికవి నాకు నెఱిగించి నటువంటి చిలుకా jIvAtumai yuMDu chilukA nI-vAvaliki paramAtmuDai yuMDu chilukA AtumapaMjaramulOna nayamuna nuMDi nA- chEtanE perigina chilukA jAtigA karmapu saMkeLLa baDi kAla@M jEta@M bEdaitivE chilukA bhAtigA chaduvulu pagalurElunu nA chEta nErichinaTTi chilukA rItigA dEhaMburekkalachATuna nuMDi sItukOruva ...

evvaDerugunu mIyettulu - ఎవ్వడెరుగును మీయెత్తులు

Image
ఎవ్వడెరుగును మీయెత్తులు మువ్వంక మెరసె మీ ముఱిపెమయ్య సొలపుల నిన్నాపె చూచీనీ నలుగడ నీవేల నవ్వేవు తెలియవు మాకు మీ తెఱగులు బలిమిని యెట్టయినా బతుకరయ్యా విరులనాపె నిన్ను వేసీనీ కెరలి బొమ్మల జంకించేవు సరిగానము మీ చందములు పరిపరి విధముల బ్రదుకరయ్యా పెనగి ఆపె నిన్ను పిలిచీనీ యెనసితివి శ్రీవేంకటేశ్వరుడా నను నేలితివిటు నయమునను పనివడి యిట్లానే బ్రదుకరయ్య evvaDerugunu mIyettulu muvvaMka merase mI mu~ripemayya solapula ninnApe chUchInI nalugaDa nIvEla navvEvu teliyavu mAku mI te~ragulu balimini yeTTayinA bratukarayyA virulanApe ninnu vEsInI kerali bommala jaMkiMchEvu sarigAnamu mI chaMdamulu paripari vidhamula bradukarayyA penagi Ape ninnu pilichInI yenasitivi SrIvEMkaTESwaruDA nanu nElitiviTu nayamunanu panivaDi yiTlAnE bradukarayya Sung by:Priya Sisters

ilavElpitaDE iMdarikini mari - ఇలువేల్పితడే ఇందరికిని మరి

Image
ఇలువేల్పితడే ఇందరికిని మరి పలువేల్పులతో పనియికనేలా కమలారమణుని కరుణేకాదా అమరులు గొనియెడియమృతము అమితపు శ్రీహరియాధారముగాదా నెమకేటి ప్రాణులు నిలిచిన భూమి దనుజాంతకు బొడ్డుతామెర కాదా జననకారణము సర్వమునకు మనికై హరిసతిమహిమే కాదా నినుపై భువిలో నిండినసిరులు యితనికొడుకు రచనింతాఁగాదా సతులపతుల సంసారరతి గతిశ్రీవేంకటపతిలోకమె వు- న్నతివైకుంటపునగరపుముక్తి ilavElpitaDE iMdarikini mari paluvElpulatO paniyikanElA kamalAramaNuni karuNEkAdA amarulu goniyeDiyamRtamu amitapu SrIhariyAdhAramugAdA nemakETi prANulu nilichina bhUmi danujAMtaku boDDutAmera kAdA jananakAraNamu sarwamunaku manikai harisatimahimE kAdA ninupai bhuvilO niMDinasirulu yitanikoDuku rachaniMtA@MgAdA satulapatula saMsArarati gatiSrIvEMkaTapatilOkame vu- nnativaikuMTapunagarapumukti Get this widget | Track details | eSnips Social DNA

hari nI mayamE aMtAnu - Top/Popular/Annamayya/annamacarya/spiritual/devotional/traditional/songs/ lyrics/Audio/videos/telugu/english

హరి నీ మయమే అంతాను అరసి నీకు శరణనియెద నేను యెదుట నెవ్వరిక నే మాటాడిన అది నీ ఘన నామాంకితమే అదివో సకల శబ్దాఖ్యుడవని నిన్ను పొదలి చదువులు పొగడీగాన యెవ్వరి పొగడాని యెక్కడ నుండిన నివ్వటిల్లనది నీ రూపే నెవ్వదీర నిదె నిను విశ్వరూపుడు యెవ్వల నని శ్రుతులెంచీగాన భావన యిది నీ బ్రహ్మాత్మకమే శ్రీవేంకటేశ నాచింతయిదే ఆవల నిను సర్వాంతర్యామెని దేవ శాస్త్రములు తెలిపీగాన hari nI mayamE aMtAnu arasi nIku SaraNaniyeda nEnu yeduTa nevvarika nE mATADina adi nI ghana nAmAMkitamE adivO sakala SabdAkhyuDavani ninnu podali chaduvulu pogaDIgAna yevvari pogaDani yekkaDa nuMDina nivvaTillanadi nI rUpE nevvadIra nide ninu viSwarUpuDu yevvala nani SrutuleMchIgAna bhAvana yidi nI brahmAtmakamE SrIvEMkaTESa nAchiMtayidE Avala ninu sarwAMtaryAmeni dEva SAstramulu telipIgAna Tuned and sung by: Sri Balakrishnaprasad Get this widget | Track details | eSnips Social DNA