Posts

parama purushuDu gOpAla - Top/Popular/Annamayya/annamacarya/spiritual/devotional/traditional/songs/ lyrics/Audio/videos/telugu/english

Image
పరమ పురుషుడు గోపాల బాలుడైనా డు మురహరు డు ఎదుట ముద్దులాడీనిదివో వేదపురాణాలలో విహరించేదేవుడు ఆదిమూలమైనట్టి అల బ్రహ్మము శ్రీదేవి పాలిటి చెలగే నిధానము సేదదీరి యశోదకు శిశువాయ నిదివో మొక్కేటి నారదాదుల ముందరి సాకారము అక్కజపు జీవులలో అంతర్యామి గక్కన బ్రహ్మకొడుకుగా గన్న పరమము అక్కరతో వెన్నముచ్చై ఆటలాడీ నిదివో దేవతలగాచుటకు దిక్కైన విష్ణుడు భావములు ఒక్కరూపైన భావతత్వము శ్రీ వేంకటాద్రి మీద చేరియున్న ఆ వరదుడు కైవసమై గొల్లెతల కౌగిళ్ళ నిదివో parama purushuDu gOpAla bAluDainAdu muraharudu eduTa muddulADInidivO vEdapurANAlalO vihariMchEdEvuDu AdimUlamainaTTi ala brahmamu SrIdEvi pAliTi chelagE nidhAnamu sEdadIri yaSOdaku SiSuvAya nidivO mokkETi nAradAdula muMdari sAkAramu akkajapu jIvulalO aMtaryAmi gakkana brahmakoDukugA ganna paramamu akkaratO vennamuchchai ATalADI nidivO dEvatalagAchuTaku dikkaina viShNuDu bhAvamulu okkarUpaina bhAvatatwamu SrI vEMkaTAdri mIda chEriyunna A varaduDu kaivasamai golletala kaugiLLa nidivO Get this widget | Track details | eSnips Social DNA

paluku tEniyalanu pAramiyyavE - Top/Popular/Annamayya/annamacarya/spiritual/devotional/traditional/songs/ lyrics/Audio/videos/telugu/english

Image
పలుకుతేనియలనుపారమియ్యవే అలరువాసనల నీ అధరబింబాలకు పుక్కిటి లేనగవు పొంగుఁబాలు చూపవే చక్కని నీ వదనంపు చందమామకు అక్కరొ నీవాలుగన్ను లారతిగా నెత్తవే గక్కన నీచెక్కు తొలుకరి మెరుపులకు కమ్మని నీమేని తావి కానుకగా నియ్యవే వుమ్మగింత చల్లెడి నీవూరుపులకు చిమ్ముల నీచెమటలఁ జేయవే మజ్జనము దిమ్మరి నీమురిపెపు తీగమేనికి పతివేంకటేశుగూడి పరవశమియ్యవే యితవైన నీమంచి హృదయానకు అతనినే తలచగ నానతియ్యగదవె తతితోడ నీలోని తలపోతలకు palukutEniyalanupAramiyyavE alaruvAsanala nI adharabiMbAlaku pukkiTi lEnagavu poMgu@MbAlu chUpavE chakkani nI vadanaMpu chaMdamAmaku akkaro nIvAlugannu lAratigA nettavE gakkana nIchekku tolukari merupulaku kammani nImEni tAvi kAnukagA niyyavE vummagiMta challeDi nIvUrupulaku chimmula nIchemaTala@M jEyavE majjanamu dimmari nImuripepu tIgamEniki pativEMkaTESugUDi paravaSamiyyavE yitavaina nImaMchi hRdayAnaku ataninE talachaga nAnatiyyagadave tatitODa nIlOni talapOtalaku Sung by:P.Suseela, G.Nageswaranayudu Get this widget | Track details | eSnips Social DNA

niMDu manasE nIpUja - Top/Popular/Annamayya/annamacarya/spiritual/devotional/traditional/songs/ lyrics/Audio/videos/telugu/english

Image
నిండు మనసే నీపూజ అండగోరకుండుటదియు నీపూజ యిందు హరిగలడందు లేడనేటి నిందకు బాయుటే నీపూజ కొందరు చుట్టాలు కొందరు పగనే అందదుకు మానుటదియే నీపూజ తిట్టులు గొన్నని దీవెనె గొంతని నెటుకోనిదే నీపూజ పెట్టిన బంగారు పెంకును నినుమును అట్టే సరియనుటదియు నీపూజ సర్వము నీవని స్వతంత్రముడిగి నిర్వహించుటే నీపూజ పర్వి శ్రీవేంకటపతి నీ దాసుల పూర్వమనియెడి బుద్ధి నీపూజ niMDu manasE nIpUja aMDagOrakuMDuTadiyu nIpUja yiMdu harigalaDaMdu lEDanETi niMdaku bAyuTE nIpUja koMdaru chuTTAlu koMdaru paganE aMdaduku mAnuTadiyE nIpUja tiTTulu gonnani dIvene goMtani neTukOnidE nIpUja peTTina baMgAru peMkunu ninumunu aTTE sariyanuTadiyu nIpUja sarwamu nIvani swataMtramuDigi nirwahiMchuTE nIpUja parvi SrIvEMkaTapati nI dAsula pUrvamaniyeDi buddhi nIpUja Tuned and sung by :Sri Mangalampalli Balamuralikrishna

kalaDA iMtaTidAta kamalanAbhuDE - Top/Popular/Annamayya/annamacarya/spiritual/devotional/traditional/songs/ lyrics/Audio/videos/telugu/english

Image
కలడా ఇంతటిదాత కమలనాభుడే కాక కలడన్న వారిపాలగలిగిన దైవము యిచ్చెను సంపదలు ఇతడింద్రాదులకునెల్ల యిచ్చెను శుకాదుల కిహపరాలు యిచ్చెను వాయుజునికి యిటమీది బ్రహ్మపట్ట- మిచ్చల ఘంటాకర్ణుని కిచ్చె కుబేరత్వము కట్టెను ధృవపట్టము కమలజు కంటే మీద కట్టె విభీషణుకు లంకారాజ్యము కట్టియిచ్చె నజునికి గతచన్నవేదాలు కట్టెను శ్రీసతి చేత కంకణ సూత్రములు పెట్టెను దేవతలకు పేరినమృతపువిందు వెట్టెను భక్తవత్సల బిరుదితడు యిట్టె శ్రీవేంకటాద్రి నిందరికిఁ బొడచూపి పెట్టె తన ప్రసాదము పృథివి జీవులకు kalaDA iMtaTidAta kamalanAbhuDE kAka kalaDanna vAripAlagaligina daivamu yichchenu saMpadalu itaDiMdrAdulakunella yichchenu SukAdula kihaparAlu yichchenu vAyujuniki yiTamIdi brahmapaTTa- michchala ghaMTAkarNuni kichche kubEratwamu kaTTenu dhRvapaTTamu kamalaju kaMTE mIda kaTTe vibhIShaNuku laMkArAjyamu kaTTiyichche najuniki gatachannavEdAlu kaTTenu SrIsati chEta kaMkaNa sUtramulu peTTenu dEvatalaku pErinamRtapuviMdu veTTenu bhaktavatsala biruditaDu yiTTe SrIvEMkaTAdri niMdariki@M boDachUpi peTTe tana prasAdamu pRthivi jIvulaku Get ...

kODekADe vIDe vIDe gOviMduDu - Top/Popular/Annamayya/annamacarya/spiritual/devotional/traditional/songs/ lyrics/Audio/videos/telugu/english

Image
కోడెకాడె వీడె వీడె గోవిందుడు కూడె ఇద్దరు సతుల గోవిందుడు గొల్లెతల వలపించె గోవిందుడు కొల్లలాడె వెన్నలు గోవిందుడు గుల్ల సంకుఁజక్రముల గోవిందుడు గొల్లవారింట పెరిగె గోవిందుడు కోలచే పసులగాచె గోవిందుడు కూలగుమ్మె కంసుని గోవిందుడు గోలయై వేల కొండెత్తె గోవిందుడు గూళెపుసతులఁ దెచ్చె గోవిందుడు కుందనపు చేలతోడి గోవిందుడు గొందులు సందులు దూరె గోవిందుడు కుందని శ్రీవేంకటాద్రి గోవిందుడు గొందిఁ దోసె నసురల గోవిందుడు kODekADe vIDe vIDe gOviMduDu kUDe iddaru satula gOviMduDu golletala valapiMche gOviMduDu kollalADe vennalu gOviMduDu gulla saMku@Mjakramula gOviMduDu gollavAriMTa perige gOviMduDu kOlachE pasulagAche gOviMduDu kUlagumme kaMsuni gOviMduDu gOlayai vEla koMDette gOviMduDu gULepusatula@M dechche gOviMduDu kuMdanapu chElatODi gOviMduDu goMdulu saMdulu dUre gOviMduDu kuMdani SrIvEMkaTAdri gOviMduDu goMdi@M dOse nasurala gOviMduDu Youtube video, PriyaSisters

hariyE erugunu aMdari - Top/Popular/Annamayya/annamacarya/spiritual/devotional/traditional/songs/ lyrics/Audio/videos/telugu/english

Image
హరియే ఎరుగును అందరి బతుకులు యిరవై ఈతని యెరుగుటే మేలు వెనకటి బ్రహ్మలు వేవేల సంఖ్యలు యెనసి బ్రహ్మాండము లేలిరట పెనగొని వారల పేరులు మరచిరి మనుజ కీటముల మరెవ్వడెరుగు ఆసఁదొల్లి మును లనంతకోట్లు చేసిరి తపములు సేనలుగా యేసిరులందిరి యెరగ రెవ్వరును వేసపునరులకు విధి యేదో కలవనేకములు కర్మ మార్గములు పలుదేవతలిటు పాటించిరి బలిమి శ్రీ వేంకట పతికి మొరయిడి వెలసిరి తుదనిదె వెరవిందరికి hariyE erugunu aMdari batukulu yiravai Itani yeruguTE mElu venakaTi brahmalu vEvEla saMkhyalu yenasi brahmAMDamu lEliraTa penagoni vArala pErulu marachiri manuja kITamula marevvaDerugu Asa@Mdolli munu lanaMtakOTlu chEsiri tapamulu sEnalugA yEsirulaMdiri yeraga revvarunu vEsapunarulaku vidhi yEdO kalavanEkamulu karma maargamulu paludEvataliTu paaTinchirib balimi SrI vEnkaTa patiki morayiDi velasiri tudanide veravindariki Get this widget | Track details | eSnips Social DNA Video : Priya Sisters

eMta cadivi cUcina nItaDE - Top/Popular/Annamayya/annamacarya/spiritual/devotional/traditional/songs/ lyrics/Audio/videos/telugu/english

Image
ఎంత చదివి చూచిన నీతడే ఘనము గాక| యింతయు నేలేటి దైవమిక వేరే కలరా|| మొదల జగములకు మూలమైన వాడు| తుద ప్రళయము నాడు తోచేవాడు || కదిసి నడుమనిండి కలిగి వుండెడి వాడు| మదన గురుడే కాక మరి వేరే కలరా|| పరమాణువైనవాడు బ్రహ్మాండమైనవాడు | సురలకు నరులకు జోటయిన వాడు|| పరమైన వాడు ప్రపంచమైనవాడు| హరి యొక్కడే కాక అవ్వలను గలరా|| పుట్టుగులయినవాడు భోగ మోక్షాలయినవాడు | యెట్టనెదురలోనను యిన్నిటివాడే|| గట్టిగా శ్రీవేంకటాద్రి కమలాదేవితోడి| పట్టపు దేవుడే కాక పరులిక గలరా|| eMta cadivi cUcina nItaDE ghanamu gAka| yiMtayu nElETi daivamika vErE kalarA|| modala jagamulaku mUlamaina vADu| tuda praLayamu nADu tOcEvADu|| kadisi naDumaniMDi kaligi vuMDeDi vADu| madana guruDE kAka mari vErE kalarA|| paramANuvainavADu brahmAMDamainavADu| suralaku narulaku jOTayina vADu|| paramaina vADu prapaMcamainavADu| hari yokkaDE kAka avvalanu galarA|| puTTugulayinavADu bhOga mOkShAlayinavADu| yeTTaneduralOnanu yinniTivADE|| gaTTigA SrIvEMkaTAdri kamalAdEvitODi| paTTapu dEvuDE kAka parulika galarA|| Get this widget | Track details ...