OhO DEMDEM - ఓహో డేండేం
ఓహో డేండేం (రాగం: ) (తాళం : ) ప|| ఓహో డేండేం వొగి బ్రహ్మ మిదియని | సాహసమున శ్రుతి దాటెడిని || చ|| పరమున నరము బ్రకృతియు ననగా | వెరవుదెలియుటే వివేకము | పరము దేవుడును అపరము జీవుడు | తిరమైన ప్రకృతియె దేహము || చ|| జ్ఞానము జ్ఞేయము జ్ఞానగమ్యమును | పూని తెలియుటే యోగము | జ్ఞానము దేహాత్మ, జ్ఞేయము పరమాత్మ | జ్ఞానగమ్యమే సాధించుమనసు || చ|| క్షరము నక్షరమును సాక్షి పురుషుడని | సరవి దెలియుటే సాత్వికము | క్షరము ప్రపంచ, మక్షరము కూటస్థుడు | సిరిపురుషోత్తముడే శ్రీ వేంకటేశుడు || OhO DEMDEM (Raagam: ) (Taalam: ) pa|| OhO DEMDEM vogi brahma midiyani | sAhasamuna Sruti dATeDini || ca|| paramuna naramu brakRutiyu nanagA | veravudeliyuTE vivEkamu | paramu dEvuDunu aparamu jIvuDu | tiramaina prakRutiye dEhamu || ca|| j~jAnamu j~jEyamu j~jAnagamyamunu | pUni teliyuTE yOgamu | j~jAnamu dEhAtma, j~jEyamu paramAtma | j~jAnagamyamE sAdhiMcumanasu || ca|| kSharamu nakSharamunu sAkShi puruShuDani | saravi deliyuTE sAtvikamu | kSharamu prapaMca, makSharamu kUTasthuDu | siripuruShOttamuDE SrI vEMkaTESuDu || L...