ప|| ఎండగాని నీడగాని యేమైనగాని | కొండల రాయడె మాకులదైవము ||
చ|| తేలుగాని పాముగాని దేవపట్టయినగాని | గాలిగాని ధూళిగాని కానియేమైన |
కాలకూటవిషమైనా గ్రక్కున మింగిన నాటి- | నీలవర్ణుడేమా నిజదైవము ||
చ|| చీమగాని దోమగాని చెలది యేమైనగాని | గాముగాని నాముగాని కానియేమైన |
పాములనిన్నిటి మ్రింగె బలుతేజిపై నెక్కు | ధూమకేతువేమో దొరదైవము ||
చ|| పిల్లిగాని నల్లిగాని పిన్న యెలుకైన గాని | కల్లగని నల్లిగాని కానియేమైన |
బల్లిదుడై వేంకటాద్రి పైనున్న యాతడి | మమ్మెల్ల కాలము నేలేటి యింటిదైవము ||
pa|| eMDagAni nIDagAni yEmainagAni | koMDala rAyaDe mAkuladaivamu ||
ca|| tElugAni pAmugAni dEvapaTTayinagAni | gAligAni dhULigAni kAniyEmaina |
kAlakUTaviShamainA grakkuna miMgina nATi- | nIlavarNuDEmA nijadaivamu ||
ca|| cImagAni dOmagAni celadi yEmainagAni | gAmugAni nAmugAni kAniyEmaina |
pAmulaninniTi mriMge balutEjipai nekku | dhUmakEtuvEmO doradaivamu ||
ca|| pilligAni nalligAni pinna yelukaina gAni | kallagani nalligAni kAniyEmaina |
balliduDai vEMkaTAdri painunna yAtaDi | mammella kAlamu nElETi yiMTidaivamu ||
By Dr.Pasupati , in Raga Nilambari (?)
|
Sung By:Balakrishna Prasad
|