jO jO yani mIru jOla - జో జో యని మీరు జోల


జో జో యని మీరు జోల పాడరో
సాజపు జయంతి నేడె సఫల మిందరికి

అదె చంద్రోదయమాయ హరి యవతారమదె
మొదలు జాతకర్మములు సేయరో
అదన పుత్రోత్సవమట పుణ్యాహము చేసి
కదిసి యిట్టె నామకరణము జేయరో

కాయము దేవకి కిచ్చి గక్కన వాసుదేవుని-
కీయరో గంధాక్షత లిటు విడేలు
కాయకపుగాడిదెకు కవణము వెట్టి మరి
వీయపుచుట్టాలెల్ల వీడువెట్టరో

షోడశోపచారముల( జొక్కించి శ్రీవేంకటేశు(
బాడరో ధర్మము నిల్పె భారమణచె
వోడించె కౌరవదానముల కంసాదుల జంపె
ఆడనే పాండవుల(గాచెననియర్ఘ్యమియ్యరో


jO jO yani mIru jOla pADarO
sAjapu jayaMti nEDe saphala miMdariki

ade chaMdrOdayamAya hari yavatAramade
modalu jAtakarmamulu sEyarO
adana putrOtsavamaTa puNyAhamu chEsi
kadisi yiTTe nAmakaraNamu jEyarO

kAyamu dEvaki kichchi gakkana vAsudEvuni-
kIyarO gaMdhAkshata liTu viDElu
kAyakapugADideku kavaNamu veTTi mari

vIyapuchuTTAlella vIDuveTTarO

shODaSOpachAramula( jokkiMchi SrIvEMkaTESu(
bADarO dharmamu nilpe bhAramaNache
vODiMche kauravadAnamula kaMsAdula jaMpe
ADanE pAMDavula(gAchenaniyarghyamiyyarO




Get this widget | Track details | eSnips Social DNA