ప|| శరణువేడెద యజ్ఞసంభవ శ్రీరామ | అరసి రక్షించుము(మమ్ము) అయోధ్యారామ ||
చ|| ధారుణిలో దశరథ తనయ రామ |చేరిన యహల్యను రక్షించిన రామ |
వారిధి బంధన కపి వల్లభ రామ | తారక బ్రహ్మమైన సీతాపతి రామ ||
చ|| ఆదిత్య కులాంబుధి మృగాంక రామ హర- | కోదండ భంజనము చేకొనిన రామ |
వేద శాస్త్ర పురాణాది వినుత రామ | ఆది గొన్నతాటకా సంహార రామ ||
చ|| రావణనుని భంజించిన రాఘవ రామ | వావిరి విభీషణ వరద శ్రీరామ |
సేవనలమేల్మంగతో శ్రీవేంకటేశుడై | ఈవల దాసుల నెల్ల ఏలినట్టి శ్రీరామ ||
pa|| SaraNuvEDeda yaj~nasaMBava SrIrAma | arasi rakShiMchumu(mammu) ayOdhyArAma ||
ca|| dhAruNilO daSaratha tanaya rAma |cErina yahalyanu rakShiMcina rAma |
vAridhi baMdhana kapi vallaBa rAma | tAraka brahmamaina sItApati rAma ||
ca|| Aditya kulAMbudhi mRgAMka rAma hara- | kOdaMDa BaMjanamu cEkonina rAma |
vEda SAstra purANAdi vinuta rAma | Adi gonnatATakA saMhAra rAma ||
ca|| rAvaNanuni BaMjiMcina rAGava rAma | vAviri viBIShaNa varada SrIrAma |
sEvanalamElmaMgatO SrIvEMkaTESuDai | Ivala dAsula nella ElinaTTi SrIrAma ||