ప||
సర్వేశ్వరుడవు స్వతంత్రడువు నీవు |
సర్వోత్తముడ నన్నిచట కావవే ||
చ||
శక్తిగలిగితే నీ సరుసదేవుడ గాన |
యుక్తి గలిగితే నే నొడలు మోతునా |
యుక్తియు శక్తియు ఒకటే లేక |
భక్తుడనైతి నన్ను పాలింపవే ||
చ||
బహుపుణ్యుడనైతే బ్రహ్మపట్టమేలనా |
సహజ విజ్ఞానినైతే సంసారి నౌదునా |
విహిత పుణ్య జ్ఞాన విముఖుడ గనకనే |
అహిశయనుడ శరణంటి కావవే ||
చ||
శ్రీవేంకటేశ నీవు చేసిన ప్రతిమ నింతే |
నీవెరుగనిది లేదు నేరుపు నాయందు నీదే |
భావము లోపల నీవే పైకొని బుద్ధియ్యగాను |
నీవాడ ననుకొంటి నేడు కావవే ||
pa||
sarvESvaruDavu svataMtraDuvu nIvu |
sarvOttamuDa nannicaTa kAvavE ||
ca||
SaktigaligitE nI sarusadEvuDa gAna |
yukti galigitE nE noDalu mOtunA |
yuktiyu Saktiyu okaTE lEka |
BaktuDanaiti nannu pAliMpavE ||
ca||
bahupuNyuDanaitE brahmapaTTamElanA |
sahaja vij~jAninaitE saMsAri naudunA |
vihita puNya j~jAna vimuKuDa ganakanE |
ahiSayanuDa SaraNaMTi kAvavE ||
ca||
SrIvEMkaTESa nIvu cEsina pratima niMtE |
nIveruganidi lEdu nErupu nAyaMdu nIdE |
BAvamu lOpala nIvE paikoni buddhiyyagAnu |
nIvADa nanukoMTi nEDu kAvavE ||
Sung by:Dwaram lakshmi
sarvESvaruDavu svataMtraDuvu - Annamayya/annamacarya lyrics/spiritual/devotional/traditional/top songs/Audio/videos/telugu/english
5:10 AM
S - Annamayya