siridolaMkeDi pagalu - Annamayya/annamacarya lyrics/spiritual/devotional/traditional/top songs/Audio/videos/telugu/english

సిరిదొలంకెడి పగలు చీకటా యితడేమి
యిరవు దెలిసియు తెలియనియ్య డటుగాన

తలపోయ హరినీలదర్పణంబో ఇతడు
వెలుగుచున్నాడు బహువిభవములతోడ
కలగుణం బటువలెనె కాబోలు లోకంబు
గలదెల్ల వెలిలోన కనిపించుగాన

మేరమీరిన నీలమేఘమో యితడేమి
భూరిసంపదలతో పొలయుచున్నాడు
కారుణ్యనిధియట్ల కాబోలు ప్రాణులకు
కోరికలు తలపులో కురియు నటుగాన

తనివోని ఆకాశ తత్వమో యితడేమి
అనఘుడీ తిరు వేంకటాద్రివల్లభుడు
ఘనమూర్తి ఆటువలెనెకాబోలు సకలంబు
తనయందె యణగి హుద్భవమందుగాన


siridolaMkeDi pagalu chIkaTA yitaDEmi
yiravu delisiyu teliyaniyya DaTugAna

talapOya harinIladarpaNaMbO itaDu
veluguchunnADu bahuvibhavamulatODa
kalaguNaM baTuvalene kAbOlu lOkaMbu
galadella velilOna kanipiMchugAna

mEramIrina nIlamEghamO yitaDEmi
bhUrisaMpadalatO polayuchunnADu
kAruNyanidhiyaTla kAbOlu prANulaku
kOrikalu talapulO kuriyu naTugAna

tanivOni AkASa tatwamO yitaDEmi
anaghuDI tiru vEMkaTAdrivallabhuDu
ghanamUrti ATuvalenekAbOlu sakalaMbu
tanayaMde yaNagi hudbhavamaMdugAna



Get this widget | Track details | eSnips Social DNA