ప|| ఆలికి మగనికి నాఱడేటికి | కాలిమితోడ లోలో తనివందరాదా ||
చ|| దొంతిబెట్ట వలపులు తోరపుబూజగుండలా | పంతాలు సంగడి బార బండికండ్లా |
యింతేసి మీ రిద్దరును యేటికి బెచ్చు రేగేరు | యెంతకెంత సేసేరు యెనసివుండరాదా ||
చ|| మమతలు పేరబెట్ట మందలపాలా యేమి | తమకము తలదూచ తాసు చిప్పలా |
జమళి నిద్దరూనెంత సరులకు బెనగేరు | తిముర నేటికి మీలో దిండుపడరాదా ||
చ|| సరిబేసి మాటలాడ జంట జాజాలా యివి | సిరులతో బెనగగ జెట్టిసాదనా |
గరిమె శ్రీ వేంకటేశ కాంతా నీవు గూడితిరి | గరువాలేటికి నింకా గలయగ రాదా ||
pa|| Aliki maganiki nArxaDETiki | kAlimitODa lOlO tanivaMdarAdA ||
ca|| doMtibeTTa valapulu tOrapubUjaguMDalA | paMtAlu saMgaDi bAra baMDikaMDlA |
yiMtEsi mI riddarunu yETiki beccu rEgEru | yeMtakeMta sEsEru yenasivuMDarAdA ||
ca|| mamatalu pErabeTTa maMdalapAlA yEmi | tamakamu taladUca tAsu cippalA |
jamaLi niddarUneMta sarulaku benagEru | timura nETiki mIlO diMDupaDarAdA ||
ca|| saribEsi mATalADa jaMTa jAjAlA yivi | sirulatO benagaga jeTTisAdanA |
garime SrI vEMkaTESa kAMtA nIvu gUDitiri | garuvAlETiki niMkA galayaga rAdA ||