ప|| ఆసమీద విసుపౌదాక యీ- | గాసిబరచుతన కపటమే సుఖము ||
చ|| తిరమగుగర్మము దెగుదాక తన- | గరిమసుఖము పొగడునందాక |
పరమార్గం బగపడుదాక తన- | పరితాపపులంపటమే సుఖము ||
చ|| కాయము గడపల గనుదాక యీ- | మాయ దన్ను వెడమరచుదాక |
రాయడిమదము గరగుదాక యీ- | రోయదగిన తనరూపమే సుఖము ||
చ|| అంకెలబొరలి నలగుదాక యీ- | యంకెలభవము లెరవౌదాక |
వేంకటపతి దడవినదాక యీ- | కింకుర్వాణపు గెలుపే సుఖము ||
pa|| AsamIda visupaudAka yI- | gAsibaracutana kapaTamE suKamu ||
ca|| tiramagugarmamu degudAka tana- | garimasuKamu pogaDunaMdAka |
paramArgaM bagapaDudAka tana- | paritApapulaMpaTamE suKamu ||
ca|| kAyamu gaDapala ganudAka yI- | mAya dannu veDamaracudAka |
rAyaDimadamu garagudAka yI- | rOyadagina tanarUpamE suKamu ||
ca|| aMkelaborali nalagudAka yI- | yaMkelaBavamu leravaudAka |
vEMkaTapati daDavinadAka yI- | kiMkurvANapu gelupE suKamu ||