ప|| ఆతనినే నే కొలిచి నే నందితి బో నిజసుఖము | శ్రీతరుణీపతి మాయాధవుడు సృష్టియింతయును హరి మూలము ||
చ|| కోరుదుమా దుఃఖములు కోర కేతెంచు తముదామే | ఆరీతులనే సుఖములు యేతెంచు నందును విచార మంతేల |
సారెకు దైవాధీనము లివి రెండు స్వయత్నములుగా వెవ్వరికి | కోరేటి దొకటే హరిశరణాగతి గోవిందుడే యింతకు మూలము ||
చ|| కమ్మంటిమా ప్రపంచము ప్రపంచము గలిగీ స్వభావము అందుకది | యిమ్ముల మోక్షము యీరీతులనే యీశ్వరుడిచ్చిన యిది గలుగు |
కమ్మి అంతర్యామికల్పితంబు లివి కాదనవుననరా దెవ్వరికి | సమ్మతించి ఆసపడియెడి దొకటే సర్వలోకపతి నిజదాస్యము ||
చ|| సరి నెఱగుదుమా పోయినజన్మము సారెకు నేమేమి చేసితిమో | యిరవుగ నట్లా మీదటిజన్మముయెఱుకలు మఱపులు యికనేలా |
నిరతమై శ్రీవేంకటేశుడు తనయిచ్చ నిర్మించిన దిది యీదేహము | గరిమెల నాతనికైంకర్యమెపో కలకాలము మాకు కాణాచి ||
pa|| AtaninE nE kolici nE naMditi bO nijasuKamu | SrItaruNIpati mAyAdhavuDu sRuShTiyiMtayunu hari mUlamu ||
ca|| kOrudumA duHKamulu kOra kEteMcu tamudAmE | ArItulanE suKamulu yEteMcu naMdunu vicAra maMtEla | sAreku daivAdhInamu livi reMDu svayatnamulugA vevvariki | kOrETi dokaTE hariSaraNAgati gOviMduDE yiMtaku mUlamu ||
ca|| kammaMTimA prapaMcamu prapaMcamu galigI svaBAvamu aMdukadi | yimmula mOkShamu yIrItulanE yISvaruDiccina yidi galugu | kammi aMtaryAmikalpitaMbu livi kAdanavunanarA devvariki | sammatiMci AsapaDiyeDi dokaTE sarvalOkapati nijadAsyamu ||
ca|| sari nerxagudumA pOyinajanmamu sAreku nEmEmi cEsitimO | yiravuga naTlA mIdaTijanmamuyerxukalu marxapulu yikanElA | niratamai SrIvEMkaTESuDu tanayicca nirmiMcina didi yIdEhamu | garimela nAtanikaiMkaryamepO kalakAlamu mAku kANAci ||