ప|| ఆతుమ సంతసపెట్టుటది యెఱుక తా- | నేతెరువు నొల్లకుండు టదియే యెఱుక ||
చ|| ముంచినబంధములలో ముణుగుడువడక తా- | నంచల విడదన్నుటిది యెఱుక |
చంచలపువిషయాల సగ్గుడుమగ్గుడుగాక | యెంచి హరిదలపోయు టిదియే యెఱుక ||
చ|| పాయనియర్థములకు బంటుబంటై తిరుగక | ఆయతమై మోసపోని దది యెఱుక |
పాయపుగామినలతో బలుమారు జేయుపొందు | హేయమనితలపోయు టిదియే యెఱుక ||
చ|| ధరమీదగలప్రాణితతుల నొప్పించక | అరయగ సముడగు టది యెఱుక |
గరిమల శ్రీవేంకటపతిదాసుడై | యిరవొంద సుఖియంటదియే యెఱుక ||
pa|| Atuma saMtasapeTTuTadi yerxuka tA- | nEteruvu nollakuMDu TadiyE yerxuka ||
ca|| muMcinabaMdhamulalO muNuguDuvaDaka tA- | naMcala viDadannuTidi yerxuka | caMcalapuviShayAla sagguDumagguDugAka | yeMci haridalapOyu TidiyE yerxuka ||
ca|| pAyaniyarthamulaku baMTubaMTai tirugaka | Ayatamai mOsapOni dadi yerxuka | pAyapugAminalatO balumAru jEyupoMdu | hEyamanitalapOyu TidiyE yerxuka ||
ca|| dharamIdagalaprANitatula noppiMcaka | arayaga samuDagu Tadi yerxuka | garimala SrIvEMkaTapatidAsuDai | yiravoMda suKiyaMTadiyE yerxuka ||